శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (16:56 IST)

'శ్రీమంతుడు' కొత్త పోస్టర్ విడుదల... మాస్ లుక్‌లో ప్రిన్స్ అదుర్స్..

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా  'శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన పోస్టర్లను అప్పుడొకటి, అప్పుడొకటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేష్ బాబు మరో కోత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
ఈ పోస్టర్‌లో మహేష్ బాబు లుక్ అదిరిపోతోంది. మిర్చి వంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో తమ అభిమాన హీరోకు అదే రేంజ్ హిట్ ఇస్తాడని మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.