బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (11:02 IST)

అన్న‌ద‌మ్ముల్లా చక్క‌గా క‌న‌ప‌డుతున్నారు... ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండ‌బోతుందో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కామెడీ రొమాంటిక్ ఫిలింలాగా అనిపిస్తూ స‌రాదాగా సాగుతూ, మంచి మ్యూజిక్‌తో కూడుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను శ్రీనివా

ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండ‌బోతుందో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కామెడీ రొమాంటిక్ ఫిలింలాగా అనిపిస్తూ స‌రాదాగా సాగుతూ, మంచి మ్యూజిక్‌తో కూడుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను శ్రీనివాస్ అవ‌స‌రాల తీసిన‌ట్టు అనిపిస్తుంది. చాలా స‌స్పెన్స్‌లు ట్రైల‌ర్‌లో క‌న‌ప‌డుతున్నాయి. సూప‌ర్‌హిట్ ఫిలిం ట్రైల‌ర్ చూసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. రోహిత్‌, నాగ‌శౌర్య‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింద‌నిపిస్తుంది. 
 
అన్న‌ద‌మ్ముల్లా చక్క‌గా క‌న‌ప‌డుతున్నారు. రెజీనీ మంచి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. క‌ల్యాణ్ ర‌మ‌ణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ బావున్నాయి. సాయి కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో సినిమా చేసే నిర్మాత‌. అదే న‌మ్మ‌కంతో శ్రీని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను నిర్మించారు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అన్నారు.
 
సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో సాయి శివాని సమర్పణలో వారాహిచలన చిత్రం బ్యానర్‌పై నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రజినీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం జ్యోఅచ్యుతానంద. కల్యాణ్ రమణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. 
 
థియేట్రికల్ ట్రైలర్‌ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. పెన్‌డ్రైవ్స్ రూపంలో పాటలను మార్కెట్లోకి విడుదల చేశారు. నాని మాట్లాడుతూ 'శ్రీనిలో డిఫ‌రెంట్ సెన్సాఫ్ హ్యుమ‌ర్ ఉంటుంది. ఈ క‌థ కూడా నాతో చెప్పాడు. విన్నంత సేపు బాగా నవ్వాను. సినిమాతో ఎమోష‌నల్‌గా బాగా క‌నెక్ట్ అయ్యాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌లో నేను ఈగ సినిమా చేశాను. కంటెంట్‌ను న‌మ్మి సినిమాలు చేసే నిర్మాతల్లో సాయికొర్ర‌పాటి ఒక‌రు. క‌ల్యాణ్ కోడూరి చాలా మంచి సంగీతం అందించారు. రోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల‌కు ఆల్ ది బెస్ట్' అన్నారు. 
 
నాగ‌శౌర్య మాట్లాడుతూ 'జ్యో అచ్యుతానంద టైటిల్ ఎలా కలిసి పోయిందో సినిమా స‌మ‌యంలో నారా రోహిత్‌, నేను అలా క‌లిసి పోయాం. ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్‌, త‌మిళంలో చాలా మంది పోటీ ప‌డుతున్నారు. ఎంత పెద్ద యాక్ట‌ర్స్ వ‌చ్చినా మా కెమిస్ట్రీని ఎవ‌రూ బీట్ చేయ‌లేరు. జీవితం అంటే సినిమాలా ఓ జ‌ర్నీ. ఈ జ‌ర్నీలో అవ‌స‌రాల శ్రీనివాస్‌, సాయికొర్ర‌పాటిని క‌లిశాను. ఆయ‌న లేకుంటే నేను సాధార‌ణ అభిమాని అయ్యుండేవాడిని. ఈ బ్యాన‌ర్‌లో నేను మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నాను. నా జీవితంలో నా త‌ల్లిదండ్రుల త‌ర్వాత నేను అంత గౌర‌వ‌మిచ్చే వ్య‌క్తి సాయి కొర్ర‌పాటికే. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయ‌న‌లా ఏ ప్రొడ్యూస‌ర్ ఉండ‌రు. క‌ల్యాణ్‌ మంచి మ్యూజిక్ అందించారు. మంచి టీం దొరికింది. చాలా సంతోషంగా ఉంది' అన్నారు.
 
నారా రోహిత్ మాట్లాడుతూ 'శ్రీనివాస్ అవ‌స‌రాల‌ వ‌ల్లే ఈ సినిమా చేశాను. ఈ జ‌ర్నీలో నాకు నాగ‌శౌర్య వంటి సోద‌రుడు దొరికాడు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే మంచి నిర్మాత సాయికొర్ర‌పాటి. నేను ఆయ‌న బ్యాన‌ర్‌లో రాజా చెయ్యి వేస్తే సినిమా చేశాను. ఆ సినిమా ఆశించినంత స‌క్సెస్ కాక‌పోయినా ఈ సినిమాకేమి అవ‌స‌ర‌మో దాన్ని న‌మ్మి పెట్టాడు. క‌ల్యాణ్ కోడూరి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌ను మ‌రింత బాగా తెలియ‌జేస్తుంది. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను' అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్‌ను అభినందించారు.