Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కావేరి సమస్యకు బాహుబలి-2 సినిమాకు లింకా? కట్టప్పకు నష్టం లేదు: రాజమౌళి

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:00 IST)

Widgets Magazine

కావేరి సమస్యకు బాహుబలి సినిమాకు సంబంధం లేదని టాలీవుడ్ దర్శకుడు, జక్కన్న రాజమౌళి అన్నారు. కావేరి నీటిజలాలను విడుదల చేయకపోవడంతో ఆ రాష్ట్రాన్ని గతంలో బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ ఏకిపారేశారు. దీంతో బాహుబలి సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే.. సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో బాహుబలి సినిమా కర్ణాటకలో ప్రదర్శితం కాబోదని.. అలా రిలీజ్ అయితే మాత్రం థియేటర్లపై దాడి చేస్తామని వట్టాళ్ నాగరాజ్ నేతృత్వంలోని బృందం హెచ్చరిస్తోంది.
 
ఈ నేపథ్యంలో రాజమౌళి దీనిపై స్పందించారు. బాహుబలి సినిమాను కన్నడీగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగారు. బాహుబలితో పాటు గత 9 సంవత్సరాల్లో ఎన్నో సినిమాలు రిలీజైనాయని రాజమౌళి గుర్తు చేశారు. ప్రత్యేకంగా బాహుబలి-2ని మాత్రం అడ్డుకోవడానికి కారణం ఏంటని అర్థం కావట్లేదని తెలిపారు.
 
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. కావేరి అంశం సున్నితమైంది. దానికి బాహుబలికి ఎలాంటి సంబంధం లేదు. సత్యరాజ్ బాహుబలి సినిమాకు దర్శకుడో, నిర్మాత కాదనే విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఈ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించకపోతే.. సత్యరాజ్‌కు ఎలాంటి నష్టం లేదని.. అయితే నిర్మాతలకే సమస్యలు ఎదుర్కొంటారని నిర్మాత షీబో అన్నారు. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్య కృష్ణ నటించిన బాహుబలి ది కన్‌క్లూజన్ ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా.. అతనితో కలిసి ఆ పని చేయను : నయనతార

నటనకు అధిక ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తమిళ అగ్రహీరోలు అజిత్, విజయ్ వంటి ...

news

ఆ రోజు నా జీవితంలో వరస్ట్ డే... 27 గంటలు నరకంలో ఉన్నా...: దిల్ రాజు

తెలుగు చిత్ర పరిశ్రమలో పంపిణీదారుడు నుంచి బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి 'దిల్' ...

news

దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్ : రాంగోపాల్ వర్మ ట్వీట్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అలియాస్ దేవినేని రాజశేఖర్ మృతిపై సినీ ...

news

కింద అండర్ వేర్... పైన మల్టీకలర్ వస్త్రంతో ఎద అందాలను కవర్ చేస్తూ...

బాలీవుడ్ హాట్ బేబీ రాఖీ సావంత్ మరోమారు వార్తలకెక్కింది. గతంలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ...

Widgets Magazine