గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (13:03 IST)

పాకిస్థాన్‌లో బాహుబలి రిలీజ్.. వరల్డ్‌వైడ్‌గా రూ.600 కోట్ల కలెక్షన్లు?

ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి' చిత్రం పాకిస్థాన్‌లో కూడా విడుదలైంది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను పాకిస్థాన్‌లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌తో అద్భుతంగా తెరకెక్కించిన విషయం తెల్సిందే. అలాగే, ఈ చిత్రంలో నటించిన నటులు కూడా అద్భుతంగా నటించారు.
 
 
అంతేకాకుండా, ఈ చిత్రాన్ని అనేక అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ఇటీవల ప్రదర్శించారు. అలాగే, అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ చిత్రం నిడివిని 23 నిమిషాల మేరకు తగ్గించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం.