బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (17:35 IST)

కట్టుకున్న భార్యను హీరోయిన్ చేయాలనుకుంటున్న షాహిద్ కపూర్! గ్రేట్ కదూ..

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు తమ సతీమణుల్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచడం పరిపాటి. టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, మంచు విష్ణు వంటి హీరోలు తమ సతీమణులను సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంచారు. అయితే బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ విషయంలో సీన్ రివర్సైంది. షాహిద్ కపూర్ మాత్రం ఇటీవల తాను మనువాడిన మీరా రాజ్‌పుత్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిసింది. 
 
తనకంటే 10 సంవత్సరాలు చిన్నది, ఢిల్లీ గర్ల్ మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన షాహిద్ కపూర్.. ప్రతి సినిమా ప్రోగ్రామ్‌కి తన భార్యతోనే వస్తున్నాడు. ర్యాంప్ వాక్‌లోనూ ఆమెతోనే నడుస్తున్నాడు. ఇదంతా స్పెషల్ అపియరెన్స్ కోసమేనని.. ఆమెను హీరోయిన్ చేసేందుకే షాహిద్ కపూర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ విషయం తెలుసుకుని షాహిద్ కపూర్ మాజీ లవర్స్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రా షాక్ తిన్నా.. కత్రీనా కైఫ్, కరీనాలు షాహిద్ నిర్ణయాన్ని స్వాగతించారు. షాహిద్ తన మిసెస్‌ను హీరోయిన్ చేయాలని ఉవ్విళ్లూరుతుండటం నిజంగానే వెరైటీ అని బాలీవుడ్ సినీ జనం ప్రశంసిస్తున్నారు. మరి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.