Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇకపై మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?: భౌతికకాయం వద్ద బోరున విలపించిన సుద్దాల అశోక్ తేజ

బుధవారం, 31 మే 2017 (09:39 IST)

Widgets Magazine
Dasari

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ సంతాపం వ్యక్తం చేశారు. దాసరి నివాసంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన కన్నీరుమున్నీరయ్యారు. 25 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో దాసరితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. కష్టంలో, బాధతో దాసరి కాంపౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఉపశమనంతో ఇంటికి వెళ్లేవారని చెప్పారు. కష్టం, కన్నీరు చూస్తే ఆయన అండగా నిలబడేవారని గుర్తు చేశారు. 
 
ఎంతోమందికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం సినీ పరిశ్రమ నిలబడేందుకు దోహదపడిందన్నారు. దాసరి కథ, మాట, పాట ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని ఆయన చెప్పారు. ఇన్నేళ్లుగా గూడుకట్టుకున్న బంధం ఒక్కసారిగా తెగిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. సినీ పరిశ్రమకు లోటు ఒక ఎత్తైతే... ఇకపై కష్టం కలిగితే సినీ కుటుంబం ఎవరికి చెప్పుకోగలుగుతుందంటూ సుద్దాల అశోక తేజ కన్నీరుపెట్టుకున్నారు. 
 
కాగా, దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో పెద్దదిక్కును కోల్పోయామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులోని దాసరి నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాసరి మృతితో తాము పెద్దదిక్కును కోల్పోయామన్నారు. సమస్య అంటే ఆయన వద్దకు వచ్చేవారమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన పులిలా అండగా ఉండేవారని ఆయన చెప్పారు. తమ సామాజిక వర్గం ఆయన మృతితో పెద్దదిక్కుని కోల్పోయిందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Emotional Dasari Death Suddala Ashok Teja

Loading comments ...

తెలుగు సినిమా

news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కర్నాటక సినీ దిగ్గజం రాజ్‌కుమార్‌ సతీమణి ...

news

దర్శక దిగ్గజం దాసరి మృతి.. కన్నీరుమున్నీరవతున్న తోలుకట్ట గ్రామ వాసులు.. ఎందుకు?

అర్థ శతాబ్దం పాటు సినీ ప్రస్థానం సాగించిన బహుదూరపు బాటసారి దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక ...

news

కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు.. రాజీ ఎరుగని బాటసారి దాసరి

సినిమా పరిశ్రమ సర్వ నాశనం కావడానికి, దర్శకుడు జీరో అయిపోయి హీరోనే కథను నిర్ణయించడానికి ...

news

స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన మరో బాలచందర్ మన దాసరి

వెండితెరను నమ్ముకొని వచ్చిన దారి దొరకని తమ్ముళ్లకు దోవ తెలియని చెల్లెళ్లకు గూడు అయ్యింది ...

Widgets Magazine