గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (18:34 IST)

'బాహుబలి' స్ఫూర్తి... భారీ చిత్రానికి సుదీప్ రెడీ..

దర్శకుడు రాజమౌళికి భారీ విజయాన్ని అందించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఎంతో మంది సినీ దర్శకులకు స్ఫూర్తిని ఇచ్చింది. అటువంటి సినిమా ఒకటైనా తీయాని అనుకోవడం సహజమే. అయితే ఒక హీరో దర్శకుడిగా మారి అలాంటి సినిమాను రూపొందించాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు యంగ్ హీరో సుదీప్.
 
ఈ కన్నడ హీరో ఈగ, బాహుబలి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. బాహుబలిలో నటించిన ఆయనకు అది సాధించిన విజయం స్ఫూర్తిని ఇచ్చిందట. దీంతో ఆయన అలాంటి కథను సిద్ధం చేయడంలో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లి, కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. మరి ఎలాంటి స్టోరీని రెడీ చేస్తాడో వేచి చూడాలి.