Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చరిత్రలో నాకూ కొన్ని పేజీలుంటాయన్నమాట.. సంబరపడ్డ ఆ పుష్పలత ఎవరు?

హైదరాబాద్, సోమవారం, 12 జూన్ 2017 (04:18 IST)

Widgets Magazine

మలయాళీగా పుట్టి తెలుగు కుటుంబంలో మెట్టి తెలుగు టీవీ చానళ్లలో గత రెండు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా యాంకర్‌గా దూసుకెళుతున్న సంబరపడిపోయన ఘటన జరిగింది. దీనికి దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక సాక్షీభూతమైంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక ఆదివారం శిల్ప కళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. దిల్‌ రాజు నిర్మాత. 
 
ఆడియో విడుదల సందర్భంగా యాంకర్‌గా వ్యవహరించిన సుమకు చిత్ర బృందం షాక్‌ ఇచ్చింది. ‘డీజే’ చిత్రంలోని ‘మెచ్చుకో..’  పాటను సుమ విడుదల చేయాలంటూ దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజు కోరడంతో సుమ ఆశ్చర్యపోయారు.
 
ఇన్నేళ్లుగా యాంకర్ పాత్ర పోషిస్తున్నప్పటికీ తనకు కొత్తసినిమా ఆడియో పాటను రిలీజ్ చేసే అవకాశం ఎవరూ ఇవ్వలేదని, తాను కూడా అలాంటి అవకాశం వస్తుందని ఊహించనే లేదని సుమ చెప్పారు. తొలిసారి ఓ పాటను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిందుకు ధన్యవాదాలంటూ స్టేజీ మీదే ఆనందపడ్డారు. 
 
దువ్వాడ జగన్నాథమ్ చిత్రం లోని పాటను విడుదల చేయడం ద్వారా చరిత్రలో తనకూ కొన్ని పేజీలుంటాయని సుమ అనడంతో వేడుకలో నవ్వులు పూశాయి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం ( వీడియో సాంగ్) వచ్చేసింది...

బాహుబలి ఒక ప్రాణం వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇంతకుముందు రెండు పాటలను విడుదల చేయగా ...

news

లావణ్య వదినకు నేనేంటే అమితమైన అభిమానం : సుబ్బరాజు

భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. ...

news

'దేవసేన'కు ప్రభాస్ మొండిచేయి.. లిప్‌లాక్ ఇచ్చే భామకు ఛాన్స్.. నిజమా?

"బాహుబలి" చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ...

news

​ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముక్కు పగలగొట్టుకున్న షారూక్ తనయడు

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్లో ...

Widgets Magazine