ఎయిర్‌టెల్‌పై సెటైర్‌లు విసిరిన అక్కినేని వారసుడు

గురువారం, 11 జనవరి 2018 (12:25 IST)

sumanth

టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ డ్రాప్ సమస్యతో కస్టమర్లు విసిగిపోతున్నారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. కాల్ డ్రాప్ సమస్యకు ఎయిర్‌టెల్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. 
 
ఈ కాల్ డ్రాప్ వ్యవహారం తనను ఎంత ఇబ్బందికి గురిచేస్తోందో సుమంత్ చెప్పకనే చెప్పారు. ఇంకా 'ఎయిర్‌టెల్ కాల్ డ్రాపింగ్ అనే కళను రెగ్యులర్‌గా ఉపయోగించడంలో విజయవంతమైందని.. అందుకు అభినందనలు..' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను టెలికాం కంపెనీల ప్రకటన తరహాలోనే ట్వీట్ చేయడం విశేషం. 
 
నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌కి స్పందిస్తూ తగు రీతిలో సెటైర్లు విసురుతున్నారు. యువకుడు, గోదావరి, గోల్కొండ హైస్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్న సుమంత్.. చాలా గ్యాప్ తర్వాత గతేడాది 'మళ్లీ రావా' అనే సినిమాలో నటించి, మంచి విజయం అందుకున్నారు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ హీరో తన తదుపరి చిత్రం ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇందిరా గాంధీగా కనిపించనున్న బాలీవుడ్ నటి

భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ లేదా వెబ్ సిరీస్‌గా ...

news

''యాపిల్ సిడర్ వెనిగర్'' తాగండి అంటున్న సమంత.. ఎందుకు?

అందరినీ ఆకట్టుకునే అందం సమంత సొంతం. మధ్య తరగతి కుటుంబం నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన ...

news

తెలుగు రాష్ట్రాల్లో సందడి.. పొరుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి కలెక్షన్ల సునామీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "అజ్ఞాతవాసి". బుధవారం విడుదలైన ఈ చిత్రం తెలుగు ...

news

కత్తి-ఆర్జీవీ తీరుపై హైపర్ ఆది: ఇదిగో తెల్ల కాకి అంటే.. అదిగో పిల్ల కాకి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' సినిమాపై వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ ...