Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా పిల్లలు నాలా తయారుకాకూడదు : సన్నీ లియోన్

సోమవారం, 2 ఏప్రియల్ 2018 (13:52 IST)

Widgets Magazine
sunny leone

బాలీవుడ్ హీరోయిన్, పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన పిల్లల కెరీర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన పిల్లలు తనలా తయారు కాకూడదని, తాను ఎదుర్కొన్న కష్టాలు తన పిల్లలు పడకూడదని అంటోంది. సన్నీ జీవితం ఆధారంగా 'కరణ్‌ జీత్‌ కౌర్‌-ది అన్‌ టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోనీ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 
 
సన్నీలియోన్ ముగ్గురు పిల్లలను తీసుకుంది. వీరి కెరీర్‌ గురించి సన్నీ లియోన్ స్పందిస్తూ, మన జీవితంలో ఏం జరిగినా ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తన పిల్లలు ఎదుర్కోకూడదని చెప్పింది. స్వేచ్ఛగా, ఎదుటివారిని బాధపెట్టకుండా, వారు ఎంచుకున్న రంగాలను తాను ఇష్టపడినా, పడకున్నా... వారు మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
అలాగే, తన జీవితంలో జరిగిన అనేక ఒడిదుడుకులను కూడా ఆమె వెల్లడించింది. 21 ఏళ్ల వయసులో తనను ద్వేషిస్తూ ఎందరో మెయిల్స్‌, మెసేజ్‌‌లు పంపేవారని గుర్తు చేసుకుంది. ఏ దేశానికి చెందిన వారు అన్నది పక్కన పెడితే సమాజం ధోరణి అలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వయసులో అలాంటి అసభ్య పదాలు జీవితంపై చాలా ప్రభావం చూపుతాయని చెప్పింది. 
 
ఈ మెయిల్స్, మెసేజ్‌లను చూసి తాను లోలోపల చాలా కుంగిపోయానని తెలిపింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులే అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. వాస్తవానికి వారికి ఇష్టం లేని రంగం ఎంచుకున్నప్పటికీ వారు తనకు అండగా నిలిచారని తెలిపింది. అందుకే తన జీవితం ఎలా ఉన్నా ప్రేమిస్తానని తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నయన్-విఘ్నేష్‌కు పెళ్లైపోయిందా..? కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం..

నయనతార, విఘ్నేష్‌లకు పెళ్లైపోయిందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దక్షిణాది సినీ ...

news

రంగస్థలం థ్యాంక్స్ మీట్ (Video) - రూ.100 కోట్ల క్లబ్‌లో

రంగస్థలం బ్లాక్‌బస్టర్ హిట్ చేసినందుకు ఆ చిత్రం యూనిట్ థ్యాక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ...

news

చెర్రీ... 'చిట్టిబాబు'లా నువ్వు తప్ప ఎవ్వరూ చేయలేరు... ఎన్టీఆర్ కామెంట్స్

రంగస్థలం చిత్రం బాక్సాఫీసులను ఒకవైపు కొల్లగొడుతూ వెళుతోంది. మరోవైపు ఎందరో ప్రశంసలను ...

news

తెలుగు రాష్ట్రాల్లో 'చిట్టిబాబు' జోరు.. "రంగస్థలం" దెబ్బకు "శ్రీమంతుడు" బేజారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం "రంగస్థలం". హీరోయిన్ సమంత. కె. సకుమార్ ...

Widgets Magazine