శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (12:54 IST)

బాలీవుడ్ క్రేజీ హీరో సరసన సన్నీలియోన్...

ఫారిన్ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు బాలీవుడ్‌లో ఆర్లు బాగానే వస్తున్నాయి. నిజానికి సన్నీలియోన్ సినిమాలంటేనే 'A' కంటెంట్ ఎక్కువగా ఉండే మూవీలని మెంటల్‌గా ఫిక్స్‌పోతుంటారు. ఈ ముద్దుగుమ్మ నటించే చిత్రాల్లో హీరో ఎవరనే విషయాన్ని ప్రేక్షకుడు గుర్తు పెట్టుకోడు. అందుకే బడా హీరోలెవరూ తమ సినిమాల్లో ఈ సెక్సీ లేడీకి ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరనే టాక్ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదావరణ గతంలో బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ సైతం సన్నీలియోన్‌తో కలిసి నటించేందుకు నో కూడా చెప్పారు. దీంతో సన్నీలియోన్‌కు హాట్ కంటెంట్ సినిమాల్లో నటించడం తప్ప మరో ఆప్షన్ లేదని ఇండస్ట్రీ వర్గాలు ఓపెన్‌గానే కామెంట్ చేశాయి. ఈ పరిస్థితుల్లో ఈ సెక్సీ బ్యూటీకి ఏకంగా బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సరసన నటించే అవకాశం దక్కింది.
 
రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్‌లో కరణ్ జోహర్ తెరకెక్కించబోయే "యే దిల్ హై ముష్కిల్" సినిమాలో సన్నీ లియోన్ కూడా కనిపించనుందట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమాలో హాట్ లేడీ గెస్ట్ రోల్‌లో కనిపించనుందనే గుసగుసలు బీ టౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే, అక్షయ్ కుమార్ నయా మూవీ "సింగ్ ఈజ్ బ్లింగ్" సినిమాలోనూ కొద్దిసేపు తళుక్కుమనబోతున్న సన్నీలియోన్. అలాగే, మరికొంతమంది హీరోల సరసన నటించే ఛాన్స్‌లు కొట్టేసే క్రమంలో సన్నీ ఉన్నట్టు సమాచారం.