శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (14:53 IST)

ఇమ్రాన్ హష్మీతో ఐటమ్ సాంగ్‌లో చిందులేయనున్న సన్నీ!!

పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్ సన్నీ లియోన్.. ఇమ్రాన్ హష్మీతో చిందులేసే ఛాన్స్‌ను సొంతం చేసుకుంది. మిలాన్ లుత్రియా అనే యాక్షన్ థ్రిల్లర్‌లో కిస్సర్ బాయ్ ఇమ్రాన్ హష్మీతో సన్నీ ఓ పాటకు స్టెప్పులేయనుంది. బాల

పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్ సన్నీ లియోన్.. ఇమ్రాన్ హష్మీతో చిందులేసే ఛాన్స్‌ను సొంతం చేసుకుంది. మిలాన్ లుత్రియా అనే యాక్షన్ థ్రిల్లర్‌లో కిస్సర్ బాయ్ ఇమ్రాన్ హష్మీతో సన్నీ ఓ పాటకు స్టెప్పులేయనుంది. బాలీవుడ్ బేబీ డాల్ అయిన సన్నీ ఈ పాటలో బంజారా లుక్‌లో కనిపించనుందని.. ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ సంబంధించిన పనులు ఇప్పటికే ముంబై సుబర్మన్ స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. 
 
ప్రస్తుతం కొరియోగ్రాఫర్లు సన్నీతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. హైదరాబాదులోనూ ఈ సాంగ్ షూటింగ్ జరుగనుంది. ఈ షూటింగ్ ఐదారు రోజుల పాటు జరుగనుంది. ఈ పాటకు విజయ్ అండ్ డింపుల్ గంగూలీ కొరియోగ్రఫీ చేస్తుండగా, ఇమ్రాన్ హష్మీ- సన్నీ కాంబోలో తెరకెక్కనున్న ఐటమ్ సాంగ్ తప్పకుండా హిట్ అవుతుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, ఇలియానా, ఇషా గుప్తా తదితరులు నటిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ నవంబర్ నుంచి రాజస్థాన్‌లో జరుగనుంది. మార్చి 2017కి ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది.