శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:49 IST)

రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల క్లబ్‌లోకి సూర్య "ఎస్-3"

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "S3-య‌ముడు-3". ఇందులో శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "S3-య‌ముడు-3". ఇందులో శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో 'య‌ముడు', 'సింగం' చిత్రాలను మించి ప్రీరిలీజ్‌కే రూ.100 కోట్ల వ్యాపారం చేసి సంచ‌ల‌నం సృష్టించింది. 
 
ఈ చిత్రం స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఈ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌లై సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంసలు పొందుతుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ... త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌తో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం "S3-య‌ముడు-3". య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం "S3-య‌ముడు-3" ఇప్ప‌టికే రూ.100 కోట్ల బిజినెస్ చేసి రికార్డు సాదించింది. 
 
ఓకే క‌థ‌, క‌థ‌నం, ఓకే ద‌ర్శ‌కుడు, ఓకే హీరో, ఓకే హీరోతో ఇలా మూడు పార్టులు రావ‌టం ఇదే మెట్ట‌మెద‌టిసారి. అయితే అన్ని చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌టం ఇదే మెట్ట‌మెద‌టి సారి. అలాగే ఈ చిత్రంలో చాలా మాస్ ఆడియ‌న్స్‌ని న‌చ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. దర్శకుడు హ‌రి ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే‌తో థ్రిల్‌ని క‌లిగించే స‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల్లో హ‌రి స్క్రీన్‌ప్లే‌కి కూడా ఫ్యాన్స్ ఉండ‌టం విశేషం.
 
ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ చూసిన తర్వాత ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. వారి అంచ‌నాలను అందుకునేలా మా చిత్రం ఉండ‌బోతుంది. సూర్య ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌గా యాక్ష‌న్‌తో మ‌రొక్క‌సారి విజృంభించారు. అనుష్క న‌ట‌న‌కి ఈసారి శ్రుతిహ‌స‌న్ గ్లామ‌ర్ అడిష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్‌లో మా సంస్థ పార్ట్ అయినందుకు చాలా అనందంగా ఉంది. హ్యారిస్ జైరాజ్ అందించిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 9న మా బ్యాన‌ర్ ద్వారా తెలుగు వెర్ష‌న్‌ని విడుద‌ల‌ చేస్తున్నాము.