దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలుగు ప్రేక్షకులనే కాకుండా భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రీదేవి... దుబాయ్‌లో బంధువుల వివాహానికి హాజరై బాత్ టబ్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి త

pnr| Last Updated: ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (16:46 IST)
దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలుగు ప్రేక్షకులనే కాకుండా భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రీదేవి... దుబాయ్‌లో బంధువుల వివాహానికి హాజరై బాత్ టబ్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఎవర్‌ గ్రీన్ హీరోయిన్ జాబితాలో ముందుండే శ్రీదేవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. తాజాగా శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కనుంది. 
 
తమ దేశంలో శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలో తెరకెక్కిన పలు చిత్రాల్లో శ్రీదేవి నటించారని స్విట్జర్లాండ్ అధికారులు ప్రకటించారు. శ్రీదేవి నటించిన పలు సినిమా షూటింగ్‌లు తమ దేశంలో జరిగాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.  ఆమె దివికేగిన నేపథ్యంలో ఆమె గౌరవార్థం శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్విజ్ సర్కారు తెలిపింది. శ్రీదేవి స్విట్జర్లాండ్ పర్యాటకం అభివృద్ధి చెందేందుకు కారకులయ్యారని తెలిపింది. 
 
శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని స్విజ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. చాలా సినిమాలను స్విట్జర్లాండ్ కేంద్రంగా తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు యశ్ చోప్రా విగ్రహాన్ని స్విస్ ప్రభుత్వం 2016లో అక్కడ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :