గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (13:32 IST)

నోరా ఫతేహితో స్టెప్పులేసిన తమన్నా.. ఊపిరి స్పెషల్ సాంగ్ అదుర్స్!

ఐటమ్ సాంగ్స్‌పై తనదైన ముద్ర వేసుకున్న హాట్ లేడీగా నోరా ఫతేహికి ప్రత్యేక స్థానముంది. అలాంటి సూపర్ గర్ల్‌తో కలిసి బాహుబలి పాలపిట్ట తమన్నా స్టెప్స్ వేసి అదరగొట్టేసింది. నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రధారులుగా ఊపిరి సినిమాకు చెందిన ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ సినిమా కోసం షూట్ చేస్తున్న స్పెషల్ సాంగ్‌లో ఫతేహి కనిపించనుంది. ఈ సాంగ్‌లోనే తమన్నా కూడా స్టెప్పులేసింది. 
 
ఈ పాటలో నోరా ఫతేహితో కలిసి తాను కూడా స్టెప్స్ వేస్తున్నానని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ పాట చాలా బాగుంటుందనీ, ఆడియన్స్‌ని ఎంతగానో అలరిస్తుందని ఆమె చెప్పింది. ఈ పాట, ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా అనిపిస్తుందని ఈ సినిమా టీమ్ అంది. పీవీపీ బ్యానర్‌పై వంశీ పైడిపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.