గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 30 నవంబరు 2015 (17:16 IST)

బొడ్డు కింద పేజీ నెం., తేదీ... కుముదం ఇంటర్వ్యూపై తమన్నా ఫైర్

మిల్కీ బ్యూటీకి కోపమొచ్చింది. తనను సంప్రదించకుండానే తమిళ పత్రిక కుముదం ఇంటర్వ్యూను ప్రచురించిందంటూ ట్విట్టర్లో పేర్కొంది. ఇలాంటి ఫేక్ ఇంటర్వ్యూలను ఆపే విషయంలో తను అలసిపోయినట్లు చెప్పుకున్నది. మరోవైపు ఈ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పినట్లు కొన్ని విషయాలను సదరు పత్రిక ప్రచురించింది. 
 
ఆ ఇంటర్వ్యూలో తమన్నా సెక్సీ చిత్రాన్ని ప్రచురించిన కుముదం, తమన్నా చిత్రంలో ఆమె బొడ్డు కింద పేజీ నెంబరును, తేదీని ప్రచురించింది. మొత్తానికి సినీ నటీనటులపై లేనివి ఉన్నట్లుగా గాసిప్స్ వస్తుంటాయి కానీ... ఇలా అడక్కుండానే ఇంటర్వ్యూలు కూడా వస్తున్నాయన్నమాట అని చెప్పుకుంటున్నారు కొందరు.