Widgets Magazine Widgets Magazine

తమన్నా దృక్పధాన్నే మార్చిన బాహుబలి: డీగ్లామర్ పాత్రకు సై

హైదరాబాద్, శనివారం, 15 ఏప్రియల్ 2017 (05:19 IST)

Widgets Magazine

బాహుబలి సినిమాలో అన్ని పాత్రల కంటే బలహీనమైన పాత్ర తమన్నాదే అనుకున్నాం. కానీ పాత్రలో మా అందరి అంచనాలను మించి నటించింది అంటూ బాహుబలి ది బిగినింగ్ విడుదల సందర్భంగా చెప్పారు ఆ చిత్ర కథకులు విజయేంద్రప్రసాద్. ఆమె పేరు వింటేనే అందం పురివిప్పి నాట్యమాడుతుంది. కానీ పచ్చబొట్టేసి, దీవరా పాటల్లో తప్పితే బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర డీగ్లామర్ పాత్రే. అడవిలో రహస్య సైనికురాలిగా మట్టి గొట్టుకుపోయిన పాత్రలో రౌద్రాన్ని, శౌర్యాన్ని, అంకిత భావాన్ని, స్త్రీసహజ సౌకుమార్యాన్ని ఎంత చక్కగా అభినయించిందంటే అనుష్క గ్లామర్ లేని లోటును తమన్నాయే తీర్చివేసింది.
tamanna
 
తమన్నా అంటే మిల్కీ బ్యూటీ అని పేరు. సౌందర్యం ధవళ వర్ణాన్ని ధరిస్తే పాలనురుగుతో మనముందుకు వచ్చే అద్భుత ఆహార్యం తమన్నాది. ఈ పదేళ్లుగా తమన్నా అంటే కోట్లు పోసి ఆమె శరీర లావణ్యాన్ని మాత్రమే కెమెరా కంటికి చూపి జుర్రుకోవాల్సిన నటిగానే చూసించి చిత్ర ప్రపంచం.  కానీ బాహుబలి సినిమాతో సౌందర్య రసాధిదేవతగా ఆమె పట్ల ఉన్న అంచనాలు అటు దర్శకుల్లో, ఇటు ప్రేక్షకుల్లో కూడా మారిపోయాయి. దీన్ని గమనించిన తమన్నా ఇప్పుడు అందాలు ఆరబోసే పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల పట్ల మక్కువ చూపించాలని నిర్ణయించేసుకున్నారు.
 
దీంట్లో భాగంగానే బాలీవుడ్‌లో తాజా చిత్రంలో మూగపాత్ర ధరించాలని డిసైడ్ అయింది. ‘అభిమానులు నన్ను విభిన్న పాత్రల్లో చూడాలనుకుంటున్నారని ‘బాహుబలి’ సినిమాతో తెలిసింది. ఇప్పుడు నేను ఓ చిత్రంలో నటిస్తున్నా. అందులో మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తా. ఇది హిందీ సినిమా.. విషు భగ్నాని ఆ సినిమాను నిర్మిస్తున్నారు’ అని తమన్నా తెలిపారు.
 
‘అభినేత్రి’ తర్వాత ప్రభుదేవాతో కలిసి మరో చిత్రం కోసం పనిచేస్తున్నట్లు తమన్నా ఈ సందర్భంగా చెప్పారు. ఇది కూడా పూర్తిగా విభిన్నమైన పాత్రని, ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తమన్నా నటించిన ‘బాహుబలి 2’ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
 Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎంత ఆర్య అయితేనేం... అడవిలో బిర్యానీ పెడతాడా: వాపోయిన కేథరీన్

అర్యతో కలిసి నటించిన కడంబన్ చిత్రం షూటింగ్‌ను కోడైకెనాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో ...

news

మురగదాస్ అంత చెత్త దర్శకుడా.. ప్రియదర్శన్ ఇలా పరువు తీశారేంటి?

ఆర్ట్ సినిమాలు, వాణిజ్య సినిమాలు అనే సరిహద్దు చెరిగిపోయిన కాలమిది. లేకపోతే బాహుబలి, ...

news

వరుణ్ తేజ్ 'మిస్టర్' సినిమా రివ్యూ ... ప్రేక్షకులను తికమకపెట్టే స్పెయిన్ బుల్లోడు

'ముకుంద'‌, 'కంచె', 'లోఫ‌ర్' వంటి విభిన్న సినిమాల‌తో మెగా హీరో వ‌రుణ్ తేజ్ ప్రేక్ష‌కుల‌కు ...

news

చాలా మంది నమ్మి మోసపోయా... విడాకులపై స్పందించిన మలయాళ హీరో

మలయాళ నటుడు దిలీప్ తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకున్న అంశంపై ...