శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జులై 2016 (14:30 IST)

జనతా గ్యారేజ్‌లో తమన్నా ఐటమ్ సాంగ్: మాస్ ఆడియన్స్ కోసం హాట్ హాట్‌గా..!!

అల్లుడు శ్రీను, స్పీడున్నోడు వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్‌ల్లో మెరిసిన అందాల ముద్దుగుమ్మ, తెల్లపిల్ల, బాహుబలి అవంతిక తమన్నా.. జనతా గ్యారేజ్ సినిమాలోనూ ఐటమ్ గర్ల్‌గా కనిపించేందుకు రెడీ అయ్యింది. ఎన్టీఆర్

అల్లుడు శ్రీను, స్పీడున్నోడు వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్‌ల్లో మెరిసిన అందాల ముద్దుగుమ్మ, తెల్లపిల్ల, బాహుబలి అవంతిక తమన్నా.. జనతా గ్యారేజ్ సినిమాలోనూ ఐటమ్ గర్ల్‌గా కనిపించేందుకు రెడీ అయ్యింది. ఎన్టీఆర్ హీరోగా, శ్రీమంతుడు ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జనతా గ్యారేజ్ సినిమాలో ప్రీ క్లైమాక్స్‌కు ముందుగా వచ్చే సాంగ్‌లో తమన్నా చిందులేయనుందట. 
 
ఈ పాట ప్రత్యేకంగా మాస్ ఆడియన్స్ కోసమేనని.. అందుకే స్టార్ హీరోయిన్ అయిన తమన్నాతో చేయించాలని సినీ యూనిట్ భావించింది. ఇందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో జనతా గ్యారేజ్ టీమ్‌తో తమన్నా కూడా త్వరలో చేరుతుంది. ఇప్పటికే గోపీచంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నా ఒప్పేసుకుంది. తాజాగా జనతా గ్యారేజ్‌లోనూ అమ్మడు నర్తించేందుకు ఓకే చెప్పేయడం ద్వారా ప్రేక్షకులకు తమన్నా తన హాట్ హాట్ అందాలతో ట్రీట్ ఇవ్వనుందని సినీ పండితులు అంటున్నారు.