Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రతి గొట్టంగాడి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (08:51 IST)

Widgets Magazine

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ప్రతి గొట్టంగాడు చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన పని లేదన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా బాగుందో లేదో నిర్ణయించేది ప్రేక్షకులని, దారినబోయే దానయ్యలు విశ్లేషణలు చేయడం కరెక్టు కాదంటూ తాజాగా జరిగిన ‘జై లవ కుశ’ సక్సెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఆవేదనతో అన్నారు. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ప్రతి గొట్టం గాడి మాటలు పట్టించుకోవద్దు, వాళ్ల గురించి మాట్లాడి మన టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అని హితవు పలికారు. 
 
జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఫ్రీ డమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు. అసలు నేనంటాను .. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? లేదా? అని మాట్లాడుకోవడం అనవసరం మనకు. సినిమా తీసిన తర్వాత అసలు అలాంటి వాళ్ల గురించి మనం ఎందుకు ఆలోచించాలి?
 
సినిమాను ప్రేక్షకులు బతికిస్తారు. ఎవడో గొట్టంగాడు చెప్పాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గొట్టంగాడి మాట పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడటం టైమ్ వేస్ట్ అని అభిప్రాయపడ్డారు. విమర్శకుడనే వాడు సద్విమర్శ చేయాలి. సినిమా బాగుంది.. బాగోలేదు. సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, బాగుండకపోతే ఎందుకు బాగోలేదో తన వరకు తాను ఎవరైనా చెప్పొచ్చు. 
 
అంతేకానీ, ‘సినిమా ఫెయిల్ అయిపోయింది’, ‘కోటి రూపాయలు వస్తాయి’, ‘పది కోట్లు వస్తాయి’, ‘డిపాజిట్లు రావు’ అంటూ విమర్శలు చేసే హక్కు ఏ విమర్శకుడికి లేదు. అసలు, వాళ్లు విమర్శకులే కారు. అటువంటి విమర్శలు చేసే వారి గురించి ఎన్టీఆర్‌లాంటి పెద్ద స్టార్ మాట్లాడటమనేది నాకు నిజంగానే బాధగా ఉంది’ అని భరద్వాజ వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్... ఆర్జీవీ సర్‌ప్రైజ్

రియల్‌స్టోరీలను సిల్వర్‌స్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ ఎవరంటే మొదటగా ...

news

వామ్మో... ఏంటి సమంతా ఇదీ? మరీ ఇంతా హాట్‌గానా?

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న ...

news

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం పేరు ఇదే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ...

news

చెర్రీ - జూనియర్ ఇద్దరూ కావాలి... అనుపమ పరమేశ్వరన్

శతమానం భవతి సినిమా హిట్ తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ అనుపమ ...

Widgets Magazine