Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాఘవేంద్రరావుకు తాప్సీ సారీ చెప్పేసింది.. ఆనందో బ్రహ్మ టీజర్‌ వచ్చేస్తోంది..

శనివారం, 15 జులై 2017 (16:33 IST)

Widgets Magazine
taapsee

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. రాఘవేంద్రరావు పండ్లు, కొబ్బరి చిప్పలతో నాభిపై కొట్టడం ద్వారా అసలేం రొమాన్స్ వుందంటూ కామెంట్స్ చేసిన తాప్సీ ఆపై తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన చేసిందే చెప్పానంది. అయితే తాజాగా రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి రాఘవేంద్రరావును క్షమించాల్సిందిగా కోరింది. 
 
తొలుత తన మాటలను సమర్థించుకున్న తాప్సీ.. ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలన్నీ మనస్ఫూర్తిగా చెప్పినవి కాదని.. వాటిని అర్థం చేసుకోలేక తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించింది. ఏదీ ఏమైనా క్షమించమని కోరింది. తనపై తాను జోకులు వేసుకుంటున్నా అనుకున్నానే కానీ.. ఇంత గొడవకు దారితీస్తాయని అనుకోలేదని.. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకేంద్రుని గురించి తప్పుగా ఎలా మాట్లాడతానని వీడియోలో పేర్కొంది.
 
రాఘవేంద్ర రావుకు తాప్సీ చెప్పడంతో ''ఆనందో బ్రహ్మ'' సినిమా నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. తాప్సీ కామెంట్స్‌తో ఆమెను బహిష్కరించాలని వ్యతిరేకత వ్యక్తమైన తరుణంలో.. తాప్సీ సారీ చెప్పేసింది. ఈ నేపథ్యంలో 'ఆనందో బ్రహ్మ' అంటూనే భయపెట్టడానికి మరో హారర్ థ్రిల్లర్ వచ్చేస్తోంది.

తాప్సి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేసి, సినిమాను ఆగస్టు 18వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శివగామి పాత్ర రమ్యకృష్ణకే రాసి పెట్టి వుంది..ఆ పాత్రలో రమ్య జీవించింది: మధుబాల

''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' ...

news

డ్రగ్స్ కేసులో రవితేజ పేరుందా? నోటీస్ అందిందా? తీసుకోని ఆ ఇద్దరెవరు? అరెస్టు తప్పదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి ...

news

కమల్ హాసన్‌‌కు మద్దతు.. ఆయనకొక సమస్య వుంటే ఊరుకోం: విశాల్ వార్నింగ్

సినీ లెజండ్ కమల్ హాసన్ ప్రస్తుతం అందరి నోళ్లల్లో నానుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి ...

news

డ్రగ్స్ వ్యవహారం.. పైసా వసూల్‌తో బిజీ.. ఎవ్వరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదన్న పూరీ.. వాట్సపే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ దందాలో ప్రముఖ సినీ నటుల పేర్లు వినిపిస్తున్న సంగతి ...

Widgets Magazine