శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (15:47 IST)

'బాహుబలి' సెకండ్ ట్రైలర్... అంచనాలను పెంచేస్తున్న జక్కన్న మూవీ (VIDEO)

భారత సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యర్లగాడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
 
మరో మూడు రోజుల్లో విడుదల కానున్న చిత్రం అంచనాలను భారీ స్థాయిలో పెంచే రీతిలో తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో భారీ జలపాతాలు, మాహిష్మతి రాజ్యంలోని వివిధ దృశ్యాలని, భారీ యుద్ధ సన్నివేశాలని చూపించారు.
 
బాహుబలి సినిమా షూటింగ్ రెండేళ్ళ క్రితం అంటే జూలై 6న ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్స్‌తోనే పలు రికార్డులను తిరగరాసిన ఈ సినిమా విడుదల తర్వాత మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.