గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 28 జులై 2016 (13:36 IST)

సుప్రీమ్ హీరో సాయి ధ‌రమ్ తేజ్...'తిక్క' టైటిల్ సాంగ్

ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరోలు ధనుష్ మ‌రియు శింబులు క‌ల‌సి ఒకే సినిమాకి పాట పాడ‌టం అనేది ఇదే మొట్ట‌మొద‌టిసారి, అది కూడా తెలుగులో పాడ‌టం విశేషం. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కో

ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరోలు ధనుష్ మ‌రియు శింబులు క‌ల‌సి ఒకే సినిమాకి పాట పాడ‌టం అనేది ఇదే మొట్ట‌మొద‌టిసారి, అది కూడా తెలుగులో పాడ‌టం విశేషం. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కోసం వీరిద్ద‌రూ చెరొక పాట పాడారు. వీరిద్ద‌రూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... థమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని సాంగ్స్‌ని ఫుల్ జోష్‌తో పాడారు. 
 
'తిక్క... తిక్క' అంటూ సాగే ఈ సాంగ్‌ని ధ‌నుష్ పాడ‌గా.. 'హీ ఈజ్ హిట్ షాట్' హీరో అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ని శింబు పాడ‌టంతో తిక్క చిత్రానికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. మెగా అభిమానుల‌తో పాటు, సామాన్య సినీ ప్రేక్ష‌కుల వ‌ర‌కూ అంద‌రూ ఈ ఆడియోని ఎప్పుడు విందామా అని వెయిట్ చేయ‌టం విశేషంగా చెప్పుకోవాలి. ఈమ‌ధ్య కాలంలో ఇంత‌లా ఏ ఆడియోకి క్రేజ్ వ‌చ్చివుండ‌దు. ఈ ఆడియోని ఈ నెల 30న మెగా అభిమానుల స‌మ‌క్షంలో విశిష్ట అతిథుల చేతుల‌ మీదుగా విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత డాక్ట‌ర్‌ సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో చిత్ర నిర్మాణంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాము. సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్‌ తేజ్ హీరోగా నిర్మిస్తున్న తిక్క చిత్రం కొసం కూడా ఏవిధంగా కూడా కాంప్ర‌మైజ్ కాకుండా షూటింగ్ చేశాము. 
 
అలాగే థ‌మ‌న్ అందించిన మా ఆడియోకి కూడా త‌మిళ సూప‌ర్‌స్టార్స్ ధ‌నుష్‌, శింబుల చేత సాంగ్స్ పాడించాము. వారు ఎంత‌గానో బిజీగా వున్నా కూడా మా మాట కాద‌న‌కుండా కంటెంట్ న‌చ్చి సాంగ్ రికార్డు చేశారు, వారిద్ద‌రూ మా చిత్రానికి సాంగ్ పాడ‌టంతో మా తిక్క చిత్రానికి క్రేజ్ విప‌రీత‌ంగా వ‌చ్చింది. అంద‌రి అంచ‌నాల‌ని అందుకునేలా మా ఆడియో వుంటుంది. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ రేంజ్‌కు తగ్గట్టుగా లావిష్‌గా చిత్రాన్ని నిర్మించాం. ఆగస్ట్ 13న గ్రాండ్‌గా తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నామని అన్నారు.
 
న‌టీన‌టులు : 
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నాసింగ్‌ న‌టించారు.
 
టెక్నిషియ‌న్స్‌.. నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి, ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి, స‌హ‌నిర్మాత‌-కిర‌ణ్ రంగినేని, కెమెరా- కె.వి.గుహ‌న్‌, సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, ఎడిట‌ర్‌- కార్తీక్ శ్రీనివాస్‌, ఆర్ట్‌- కిర‌ణ్ కుమార్‌, పి.ఆర్‌.వొ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను, క‌థ‌- షేక్ దావూద్‌; మాట‌లు- హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌; డాన్స్‌- ప్రేమ్ ర‌క్షిత్‌; యాక్ష‌న్‌- విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, రామ్‌-లక్ష్మ‌ణ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా.