గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By venu
Last Updated : బుధవారం, 24 మే 2017 (12:39 IST)

ఆ మూడు చిత్రాల ఫ్లాప్‌లకు హీరోలే కారణం... నందమూరి, కొణిదెల హీరోలపై మణిశర్మ ఆరోపణలు

ఇప్పటిదాకా హీరోలు దర్శకత్వ శాఖలోనే చేతులు పెడతారని విని ఉంటారు. తమ పని తమను చేసుకోనివ్వడం లేదని ఎంతో మంది దర్శకులు ఆఫ్ ది రికార్డ్ వాపోతుంటారు. శ్రీను వైట్ల అయితే తన 'దుబాయ్ శీను' సినిమాలో ఏకంగా ఎమ్మె

ఇప్పటిదాకా హీరోలు దర్శకత్వ శాఖలోనే చేతులు పెడతారని విని ఉంటారు. తమ పని తమను చేసుకోనివ్వడం లేదని ఎంతో మంది దర్శకులు ఆఫ్ ది రికార్డ్ వాపోతుంటారు. శ్రీను వైట్ల అయితే తన 'దుబాయ్ శీను' సినిమాలో ఏకంగా ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్ ఫైర్ స్టార్ సాల్మన్ రాజ్‌తో తెలుగు తెర హీరోల చరిత్రను ఏకిపారేశాడు. స్టంట్లు, కెమెరాల నిపుణులకూ ఈ హీరోల ఫింగరింగ్ తప్పలేదు.
 
ఇప్పుడీకోవలోకి సంగీత దర్శకత్వ శాఖ కూడా చేరిందనే విషయాన్ని బహిర్గతపరిచి టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపాడు మణిశర్మ. కథకు, థీమ్‌కు అనుగుణంగా తమశైలిలో తమను పాటలను ట్యూన్ చేయనివ్వడం లేదని, కేవలం తమ డ్యాన్స్ లేదా మాస్ బీట్‌లు కావాలని వేధిస్తుంటారని వాపోయాడు. 2011లో తీన్‌మార్ (పవన్ కళ్యాణ్), పరమవీరచక్ర (బాలకృష్ణ), శక్తి (ఎన్టీఆర్) చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు.
 
పలు కారణాలతో చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మణిశర్మ చేతిలో ప్రస్తుతం 'లేడీస్ టైలర్' రెండో భాగంగా విడుదల కానున్న వంశీ దర్శకత్వంలోని 'ఫ్యాషన్ డిజైనర్', 'అమీతుమీ' అనే మరో చిత్రం ఉంది. ఎన్ని వివాదాలు, మనస్పర్థలు ఉన్నా గుంభనంగా గడిపేయడంలో పెట్టింది పేరైన టాలీవుడ్‌లో ఇలాంటి ప్రత్యక్ష ఆరోపణలు చేసిన మణిశర్మ మరెంతోకాలం ఇండస్ట్రీలో మన్నలేరని సినీరంగ ప్రియులు అంటున్నారు.