బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 23 మే 2016 (15:54 IST)

ట్రాన్స్‌లేషన్ కంపెనీ ప్రారంభించిన చిన్మయి శ్రీపాద.. 3 వేల మందికి ఉపాధి...

చిన్మయి శ్రీపాద అంటే తెలియని వారుండరు. గాయనిగానే కాకుండా తన స్వర మాధుర్యంతో కుందనపు బొమ్మ సమంతకు అందమైన గాత్రాన్ని అందిస్తోంది. అంతేకాదు బెస్ట్‌ వాయిస్‌ ఆర్టిస్ట్‌గా "నంది అవార్డును'' సొంతం చేసుకుంది. సింగర్‌గా తన కెరియర్‌ని ప్రారంభించిన చిన్మయి తాజాగా కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. 
 
ఇటీవల కాలంలో తమిళ, తెలుగు సినిమాలు ఎల్లలు దాటి విదేశాలలో రిలీజవుతున్ననేపథ్యంలో కొన్నిసార్లు అక్కడి భాషల్లోకి ఆయా సినిమాలను డబ్ చేయడం లేదా సబ్ టైటిల్స్ వేసి రిలీజ్ చేయడం వంటివి చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చిన్మయి హేకా స్టూడియోస్ పేరుతో ఆర్కిటెక్చర్ యండ్ ఇంటీరియయర్ డిజైన్ స్టూడియో సంస్థను ప్రారంభించింది. 
 
ఈ ట్యాలెంటెడ్ సింగర్ గతంలో కూడా ఓ బిజినెస్ స్టార్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌లేషన్ సర్వీసులను నిర్వహించే ఆ కంపెనీ పేరు ''బ్లూ ఎలిఫెంట్''. ఇప్పుడీ కంపెనీలో 3 వేల మంది అనువాదకులు (ట్రాన్స్‌లేటర్లు) 150కిపైగా భాషలకు సంబంధించిన అనువాద సర్వీసులు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో చిన్మయికి నిర్మాతల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందట. ఇంత మందికి ఉపాధి కల్పించడమంటే మాటలా.. మనస్ఫూర్తిగా చిన్మయికి అభినందనలు చెప్పాల్సిందే.