Widgets Magazine

నేడు అన్నగారి వర్థంతి.. నెక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన హీరోలు

గురువారం, 18 జనవరి 2018 (08:52 IST)

sr ntr

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతిని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చి నివాళులు అర్పించారు. 
 
ముఖ్యంగా, ఎన్టీఆర్ కుమారులైన సినీ నటుడు బాలకృష్ణ, ఆయన సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేటికీ అమలు అవుతున్నాయని పెద్ద కుమారుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అన్నారు. అటువంటి మహానుభావుడి గురించి మాట్లాడుకునేందుకు ఎన్ని యుగాలైనా చాలవన్నారు. తెలుగు భాష ఈ భూమ్మీద ఉన్నంత వరకు ఎన్టీఆర్ మన మధ్య జీవించి ఉంటారన్నారు.
 
ఆ తర్వాత హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తని కొనియాడారు. తెలుగు ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కత్తి మహేశ్ అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపేవాడు... రేపు చూడండి... నిర్మాత సంచలనం

కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో ...

news

రూ.20లక్షల పన్ను ఎగ్గొట్టిన అమలా పాల్: బెయిల్ మంజూరు చేసిన కోర్టు

అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ ...

news

సొంత ఊరిలో కత్తి మహేష్‌ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ...

news

హీరోలతో పోటీకి సై అంటోన్న భాగమతి: బ్లాక్‌బస్టర్ ఖాయమా?

''పిల్ల జమీందారు'' ఫేమ్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో... యూవీ క్రియేషన్స్ సంస్థ రూపొందించిన ...

Widgets Magazine