శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (11:02 IST)

దాసరి అంత్యక్రియలకు ఆ ముగ్గురు ఎందుకు రాలేదంటే? ఆస్తి గురించి దాసరి కోడలు అప్పుడే మొదలెట్టిందా?

దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రాలేకపోయారు. దాసరితో ఎన్నో సినిమాలు తీసిన ఈ నటులు దాసరి మృతదేహాన్ని కడసారి చూడలేకపోయారు. దర్శకరత్న అంతిమయాత్రలో పాలుపంచుకోలేకపోయా

దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రాలేకపోయారు. దాసరితో ఎన్నో సినిమాలు తీసిన ఈ నటులు దాసరి మృతదేహాన్ని కడసారి చూడలేకపోయారు. దర్శకరత్న అంతిమయాత్రలో పాలుపంచుకోలేకపోయారు. ఇందుకు కారణం వీరు హైదరాబాదులో లేకపోవడమే కారణమని సమాచారం. కానీ హైదరాబాద్ లోనే ఉన్న వెంకటేష్ మాత్రం దాసరికి నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది దక్షిణాది నటీ నటులంతా ఎక్కడో ఒక చోట సమావేశం అవుతారు. ఈ సంవత్సరం వారంతా జూన్ మొదటి వారంలో చైనాలో కలవాలని నిర్ణయించుకున్నారు. 
 
1980 దశకంలో ఓ దక్షిణాది పరిశ్రమను ఓ ఊపు ఊపిన వారంతా ఈ సమావేశం కోసం చైనాకు వెళ్లారు. వారితో పాటు చిరంజీవి, నాగార్జున, చైనాకు వెళ్లగా, బాలకృష్ణ తన కొత్త చిత్రం షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు. దాసరి మరణ వార్త వీరిని కలచివేసినప్పటికీ, అక్కడి నుంచి వెంటనే బయల్దేరినా కడసారి చూపులు సాధ్యం కాదని తెలియడంతో రాలేకపోయారు. 
 
ఇదిలా ఉంటే.. దాసరి నారాయణ రావు మృతిపై అనుమానాలున్నాయని ఆయన పెద్ద కోడలు మీడియాతో చెప్పారు. తన కుమారుడిని సినీ రంగానికి పరిచయం చేస్తానని మామయ్య హామీ ఇచ్చారన్నారు. ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తానని.. ఆపై కూర్చుని మాట్లాడుకుని ఆస్తి ఇస్తామన్నారన్నారు.

ఆస్తి సంగతిని తేల్చేసి.. తన మనవడిని తనతోనే ఉంచుకుంటానని దాసరి వెల్లడించినట్లు పెద్ద కోడలు సుశీల వెల్లడించారు. అంతలా మంచి మాటలు మాట్లాడిన మామయ్య ఉన్నట్టుండి చనిపోవడంపై తనకు అనుమానాలున్నాయని ఆరోపించారు. అయితే, సుశీల ఆరోపణలపై దాసరి అభిమానులు మండిపడుతున్నారు. కర్మకాండలు పూర్తి కాకముందే ఆస్తికోసం ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు.