Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గ్లామర్‌కు పాఠాలు నేర్పుతున్న చెన్నై చిన్నది... మళ్లీ వరించిన జెస్సీ పాత్ర

హైదరాబాద్, మంగళవారం, 4 జులై 2017 (06:02 IST)

Widgets Magazine
Trisha

ఏం మాయ చేశావే చిత్రం సమంతకు పదేళ్ల కెరీర్‌ని అలా చేతుల మీద పెట్టి అందించింది. అలాగే తమిళంలో కూడా జెస్సీ పాత్ర పోషించిన పేరు లేటు వయసులో కూడా  మార్మోగి పోయింది. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో శింబుకు జంటగా విన్నైతాండి  వరువాయా చిత్రంలో త్రిష నటించిన పాత్ర పేరు జెస్సీ. ఆ చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా త్రిష కెరీర్‌ మారిపోయింది. 
 
చాలాకాలం తరువాత త్రిష మళ్లీ జెస్సీగా మారుతున్నారట. అయితే ఈ సారి తను మలయాళ చిత్రం ద్వారా అలాంటి పాత్రలో కనిపించనున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు తొలిసారిగా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ప్రసాద్‌ దర్శకత్వంలో నవీన్‌ పౌలీకి జంటగా నటిస్తున్నారు.
ప్యూర్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేజూడే అనే టైటిల్‌ను నిర్ణయించారు. 
 
ఇందులో త్రిష జెస్సీ తరహా పాత్రలో మరోసారి క్రిస్టియన్‌ అమ్మాయిగా నటిస్తున్నారట. ఈ చిత్రం తన కేరీర్‌ను మరో మలుపు తిప్పుతుందనే ఆశాభావంతో ఉన్నారామె. నటి త్రిష సినీ జీవితంలో జెస్సీ పాత్ర మరువలేనిది. ఇపుడు మళ్లీ అదే తరహా పాత్రలో మళయాళంలో మెరవనున్నారు. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో శింబుకు జంటగా విన్నైతాండి వరువాయా చిత్రంలో త్రిష నటించిన పాత్ర పేరు జెస్సీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకుంటే ఆ చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా త్రిష కెరీర్‌ మారిపోయిందని చెప్పవచ్చు. 
 
అప్పటివరకూ కమర్షియల్‌ నాయకిగా గ్లామర్‌ పాత్రలకు పరిమితమైన త్రిష జెస్సీ పాత్రలో తన అభినయంతో మంచి బలమైన పాత్రలను చేయగలనని నిరూపించుకున్నారు. మంచి యూత్‌ఫుల్‌ చిత్రంగా తెరకెక్కిన విన్నైతాండి వరువాయా చిత్రం విడుదల తరువాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జెస్సీ అని పేరు పెట్టుకున్నారంటే ఆ పాత్ర ప్రభావం వారిపై ఎంతగా చూపిందో అర్ధం చేసుకోవచ్చు. 
 
కాగా, ప్రస్తుతం త్రిష తమిళంలో నటించిన చతురంగవేట్టై-2 చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా గర్జన, మోహిని, 96 అంటూ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దంగల్ కలెక్షన్లపై అబద్ధాల కథనాలు.. మొత్తం వసూళ్లు రూ. 1,864 కోట్లు మాత్రమేనట

అనుమానిస్తున్నదే నిజం అయింది. బాహుబలి 2 సినిమా ప్రభంజనంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు కుట్ర ...

news

ప్రభాస్‌తో సోనమ్ ఇందుకే కుదరదందా? లండన్ వీధుల్లో బోయ్ ఫ్రెండుతో(వీడియో)

సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్ వీధుల్లో తన ప్రియుడు అని బాలీవుడ్ సినీజనం చెప్పుకునే ఆనంద్ ...

news

సుప్రియ చెప్పిందే శాసనం... అన్నపూర్ణ స్టూడియోస్ ఏమవుతుంది?

ఈ పంచ్ డైలాగ్ బాహుబలి చిత్రంలో శివగామి చెప్తుంది. ఆమె చెప్పే మాటే శాసనం. తేడా వుండదంతే. ...

news

ఆలూ మొహం ఉన్న అతను పెద్ద హీరోనా? : బన్నీపై కేఆర్కే కామెంట్స్

ఆలూ మొహం ఉన్న అల్లు అర్జున్ టాలీవుడ్‌లో పెద్ద హీరోనా? అంటూ చిత్ర విమర్శకుడు కమాల్ రషీద్ ...

Widgets Magazine