Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వయసు పెరుగుతున్న కొద్ది జోరు పెంచుతోంది.. ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!

హైదరాబాద్, సోమవారం, 12 జూన్ 2017 (04:59 IST)

Widgets Magazine
Trisha

ఒక సంవత్సరంలో 10కి పైగా సినిమాల్లో నటించి విడుదల చేసిన ఓన్లీ ది గ్రేటెస్ట్ నటుడు ఎవరో తెలుసా. ఇంకెవరు మన  అలనాటి సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మొహమాటానికి పోయి సినిమాలను ఒప్పుకుని వాటిని పూర్తి చేయాడనికి మూడు షిప్టుల్లో కూడా పనిచేశారన్న ఘనత కృష్ణగారికే దగ్గింది. బహుశా ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఇంత బీభత్సంగా సినిమాల్లో నటించిన రికార్డు మరెవ్వరికీ లేదనే చెప్పాలి.
 
 
దాదాపు ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇప్పుడు కృష్ణగారికి పోటీగా మన నవ జవ్వని బరిలో నిలబడుతున్నట్లుంది. 1980లలో కృష్ణ సినిమాల మీద సినిమాలు తీస్తే 2017లో ఆ రికార్డు నా సొంతం అంటోంది త్రిష.  ఇక కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటున్న టైంలో బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 
 
ధనుష్ సరసన హీరోయిన్ గా నటించిన కోడి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న త్రిష, ఈ ఏడాది మిగిలిన ఆరునెలల సమయంలో తను నటించిన ఆరు సినిమాలను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సినిమాలతో పాటు తాజా మరో సినిమాను స్టార్ట్ చేసింది.
 
ఇప్పటికే మోహిని, గర్జనై, శతురంగ వేట్టై సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తమిళ సినిమా 1818తో పాటు మలయాళ సినిమా హేయ్ జూడ్‌ల షూటింగులో పాల్గొంటుంది త్రిష. 
 
వీటితో పాటు తాజా అనే సినిమాకు కూడా డేట్స్ ఇచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12 నుంచి సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివరకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. వయసు పెరుగుతున్న కొద్ది జోరు పెంచుతోంది చెన్నై చంద్రం త్రిష. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ లేకున్నా సాహో చిత్రం షూటింగ్ షురూ... విలన్‌గా సరిజోడు నీల్ నితిన్

ఒక భారతీయ సినిమాలోని పాటలు, దృశ్యాలు, విజువల్స్‌ని భాష అర్థం కాకున్నా దక్షిణాఫ్రికా నుంచి ...

news

చరిత్రలో నాకూ కొన్ని పేజీలుంటాయన్నమాట.. సంబరపడ్డ ఆ పుష్పలత ఎవరు?

మలయాళీగా పుట్టి తెలుగు కుటుంబంలో మెట్టి తెలుగు టీవీ చానళ్లలో గత రెండు దశాబ్దాలకు పైగా ...

news

ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం ( వీడియో సాంగ్) వచ్చేసింది...

బాహుబలి ఒక ప్రాణం వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇంతకుముందు రెండు పాటలను విడుదల చేయగా ...

news

లావణ్య వదినకు నేనేంటే అమితమైన అభిమానం : సుబ్బరాజు

భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. ...

Widgets Magazine