బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2015 (20:21 IST)

బుల్లితెర కార్మికులకు వేతనాలు పెంపు

తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ కార్మికుల సమస్యలు తీర్చేందుకు టీవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంగీకరించింది. వేతనాలు పెంచాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న టీవీ కార్మికులకు ఆమోదం లభించింది. తమ అభ్యర్థనలకు స్పందించి వేతనాల పెంపు నిర్ణయం తీసుకున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు టీవీ ఫెడరేషన్‌లోని అన్ని శాఖల కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
 
ఈమేరకు హైదరాబాద్ ఫిలించాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ లోని అన్ని శాఖల కార్మికులు, కార్మిక నేతలు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో టీవీ ఫెడరేషన్ చైర్మెన్ మాచినేని శ్రీనివాసరావు, అధ్యక్షుడు విజయ్ యాదవ్ తోపాటు నాయకులు సీహెచ్.సీ ప్రసాద్, కునపరెడ్డి శ్రీనివాస్.. అన్ని శాఖల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
 
వేతనాల పెంపు ఇలా..
టీవీ కార్మికులు కోరిన విధంగా 30 శాతం వేతనాలు పెంచడం జరిగింది. ప్రొడక్షన్స్ వారికి గతంలో 550 రూపాయల వేతనం ఉండేది. అప్పుడు వారికి రూ. 650 వేతనం పెరిగింది. ఆన్ లైన్ కెమెరామెన్ కు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 3000, ఆ తర్వాత గంటకు అదనంగా రూ.150. ఇక లైట్స్ మేన్ కు గతంలో 550 రూపాయలు ఉండగా అది ఇప్పుడు 600కు చేరింది. ఆన్ లైన్ లైట్స్ మేన్ 600 నుంచి 650, కాస్ట్యూమ్స్ కు 900 నుంచి 1200, మేకప్ మేన్ కు 1750 నుంచి 2200, ఆర్ట్ డిఫర్ట్ మెంట్ 1400 నుంచి 1600, మేనేజర్స్ మినిమం 18000. డ్రైవర్ కు 400 నుంచి 550.