శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (13:30 IST)

'కమల్‌కు సొంత ఇల్లే లేదు.. ఆయన దివాళాకు నేను కారణం కాదు'.. మాజీ భార్య ఫైర్...

యూనివర్శల్ హీరో కమల్ హాసన్‌పై ఆయన మొదటి భార్య వాణీ గణపతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు కమల్ చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చేశాడు. అయితే ఇటీవల ఒక సందర్భంగా కమల్ మాట్లాడుతూ తన మొదటి భార్య వాణీకి విడాకులు ఇచ్చిన సమయంలో 'మనోవర్తి'ని చెల్లించడం వలన తాను దివాలా తీసినట్టుగా తెలిపాడు. ఆ సమయంలో తాను సొంత ఇల్లును కూడా వదులుకుని అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందని తెలిపాడు. 
 
ఇప్పుడు ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం మౌనంగా ఉన్న వాణీ, కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తన కారణంగా కమల్ ఇబ్బందుల్లో పడినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. తనకు మనోవర్తిని చెల్లించడం వలన దివాళా తీసినట్టుగా కమల్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అసలు అప్పట్లో ఆయనకు సొంత ఇల్లే లేదని, అలాంటప్పుడు అద్దె ఇంట్లోకి మారినట్టుగా చెప్పడమేంటని వాణీ ప్రశిస్తున్నారు.  
 
ప్రస్తుతం కమల్ ఉంటున్న ఇల్లు కూడా తాను కొనుక్కున్నదేనని వాణీ గుర్తుచేశారు. కమల్ దివాళా తీయడానికి వేరే కారణాలు ఉండొచ్చనీ, అందుకు తనని బాధ్యురాలిని చేస్తూ మాట్లాడటం ఎంతవరకు న్యాయమని వాణీ పేర్కొన్నారు.