శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2015 (17:03 IST)

సర్దార్ గబ్బర్ సింగ్‌లో వరుణ్ తేజ్.. బాబాయ్‌ని రిక్వెస్ట్ చేసిన‌..?

సర్దార్ గబ్బర్ సింగ్‌లో వరుణ్ తేజ్ నటించబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం లోఫర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. బాబాయ్ పవన్ కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్‌లో నటిస్తానని రిక్వెస్ట్ చేసి.. ఓ రోల్ చేస్తున్నాడని సమాచారం. 2016 సమ్మర్ కానుకగా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్‌లో పవన్‌తో పాటు వరుణ్ తేజ్ స్క్రీన్ పంచుకోనున్నాడని తెలిసి.. మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 
 
ఇక ఈ సినిమాలో చందమామ హీరోయిన్, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కల్యాణ్ వరుణ్ రిక్వెస్టుకు ఓకే చెప్పేయడంతో సర్దార్‌లో లోఫర్ హీరో నటించేందుకు ఛాన్స్ దక్కిందని యూనిట్ వర్గాల సమాచారం. ఇప్పటికే గబ్బర్ సింగ్ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది.