Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాయి పల్లవి నటనకు ప్రవాసీలు 'ఫిదా'.. కలెక్షన్ల వర్షం...

మంగళవారం, 25 జులై 2017 (07:04 IST)

Widgets Magazine

భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసీలు కూడా 'ఫిదా' అయిపోయారు. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా'. ఇది గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. ముఖ్యంగా, అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఓ రోజు ముందుగానే విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Fidaa
 
వరుణ్ తేజ్ గత చిత్రాలైన 'ముకుంద', 'కంచె', 'లోఫర్' సినిమాలు ఓవర్సీస్‌లో ఓ మోస్తరుగా ఆడినా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. కానీ ఆయా సినిమాల ఓవరాల్ కలెక్షన్లను 'ఫిదా'.. కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ప్రీమియర్స్ ద్వారా గురువారం 3,63,325 డాలర్లు కలెక్ట్ చేయగా ఆ తర్వాత శుక్ర, శనివారాల్లో మొత్తం కలిపి 7,13,325 డాలర్లను కొల్లగొట్టినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే వరుణ్ తేజ్.. గత సినిమాల ఓవరాల్ కలెక్షన్లను ఫిదా దాటేయడంతో చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసులు కూడా ఫిదా అయ్యారని, అందుకే ఈ చిత్రాన్ని చూసేందుకు ఎన్నారై ప్రేక్షకులు క్యూ కడుతున్నారనీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మత్తు దందాలో ఇరికిస్తారని భయమేస్తోంది... బోరున విలపిస్తున్న చార్మీ

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో తనను ఇరికిస్తారనే భయం పట్టుకుందని సినీ నటి ...

news

నువ్వు పొట్టిగా ఉన్నావు... ఛాన్సులు అడొగొద్దు... హీరోయిన్‌కు షాక్...

అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కేరళకుట్టి ఆ తరువాత ...

news

కమల్‌కు విజయ్ కాంత్ మద్దతు.. రజనీ కూడా త్వరలోనే ఆ పని చేస్తారు.. ఇక సీఎం ఆయనే?

తమిళనాడు సర్కారుపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కమల్‌కు పలువురు ...

news

టాలీవుడ్ షేకింగ్... కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ అరెస్ట్... ఏం జరుగుతోంది...?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో షేక్ అవుతోంది. రోజుకో వ్యక్తి పేరు బయటకు వస్తోంది. తాజాగా ...

Widgets Magazine