బాబాయ్ టైటిల్‌తో అబ్బాయి సినిమా... మెగా ఫ్యాన్స్ వార్?

సోమవారం, 4 డిశెంబరు 2017 (17:06 IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను ఓ మలుపుతిప్పిన చిత్రం "తొలిప్రేమ". తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలిప్రేమ ఆ కాలంలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇపుడు ఇదే టైటిల్‌తో అబ్బాయి వరుణ్ తేజ్ ఓ చిత్రంలో నటించనున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరో వరుణ్ తేజ్.
tholiprema movie still
 
పవన్ కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ టైటిల్‌ను ఇప్పుడు అబ్బాయ్ వాడుకోనున్నాడు. బాబాయ్ తొలిప్రేమకు సుకుమార్ దర్శకత్వం వహిస్తే ఇపుడు అబ్బాయి చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం. రాశీఖన్నా హీరోయిన్. మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో "తొలిప్రేమ".. 'ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే ట్యాగ్‌తో పవన్ అభిమానులు షాక్ అయ్యారు.
 
'తొలిప్రేమ' అనే టైటిల్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో కేవలం వరుణ్ తేజ్‌ని మాత్రమే చూపించారు. పోస్టర్‌లో వరుణ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ వరుణ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. వచ్చే యేడాది ఫిబ్రవరి 9వ తేదీన 'తొలిప్రేమ' సినిమాని విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించారు.
 
అయితే, పవన్ కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచిన తొలి ప్రేమ టైటిల్‌ని వరుణ్ తేజ్ మూవీకి వాడుతున్నారని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కొత్త దర్శకుడితో తీసే 'తొలిప్రేమ' చిత్రం ఫెయిల్ అయితే తమ హీరో చిత్రానికి చెడుపేరు వస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎస్ థమన్ సంగీత బాణీలు సమకూర్చే ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మించనున్నారు. దీనిపై మరింత చదవండి :  
Tholi Prema New Movie Pawan Kalyan Varun Tej Move Title Mega Fans War

Loading comments ...

తెలుగు సినిమా

news

మాటల మాంత్రికుడి వెంటపడ్డ ఛార్మి...

డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ...

news

డబ్బులు తీసుకుని పవన్‌ను పొగడలేదు.. ఓ కూజా, మట్టిగ్లాసు పెట్టుకుని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ ...

news

శ్రీవారి సేవలో చెర్రీ - ఉపాసన... కొణిదెల వారింట శుభవార్త?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఆయన సతీమణి, అపోలో ఆస్పత్రి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ...

news

వార్ సినిమాలో సన్నీలియోన్.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటుందట..

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే టాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ...