గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (17:33 IST)

సినిమాలు ఫట్ అవుతున్నా రకుల్‌కి తగ్గని క్రేజ్: వరుణ్ తేజ్‌తో కొత్త సినిమా!

టాలీవుడ్ కెరీర్ ప్రారంభంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ వంటి హిట్ సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆపై హిట్స్ కరువయ్యాయి. కిక్ 2, బ్రూస్‌లీ దారుణంగా ఫట్ కావడంతో ఆమెకు సినీ జర్నీ సాఫీగా సాగట్లేదు. ‘పండగ చేస్కో’ ఏవరేజ్ అనిపించుకున్నా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా అమ్మడుకు ఛాన్సులు ఏ మాత్రం తగ్గట్లేదు. 
 
ఇప్పటికే నాన్నకు ప్రేమతో - సరైనోడు లాంటి పెద్ద సినిమాలు చేస్తున్న రకుల్.. తాజాగా ఇంకో మంచి ఛాన్స్ కొట్టేసింది. మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రకులే హీరోయిన్‌గా ఫిక్సయింది. రకుల్, గోపీచంద్ దర్శకత్వంలో ఇప్పటికే ‘పండగ చేస్కో’ చేసింది. ఆ సినిమాలో రకుల్ పెర్ఫామెన్స్ నచ్చడంతో గోపీ ఆమెకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు.
 
‘పండగ చేస్కో’ తర్వాత మురుగదాస్ కథతో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నించి విఫలమైన గోపీ.. చివరికి వరుణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో సాగే ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. వరుణ్ మూడో సినిమా ‘లోఫర్’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపి, వరుణ్, రకుల్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.