శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (10:23 IST)

'వెంకటాపురం' సెకండ్ లుక్ విడుదల

గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'వెంకటాపురం'. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఊపుతో సెకండ్ లుక్ పో

గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'వెంకటాపురం'. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఊపుతో సెకండ్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కాలేజ్‌లో సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. వేణు ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నిఖిల్ నటించిన 'స్వామి రారా', నారా రోహిత్ నటించిన 'రౌడీ ఫెలో' చిత్రాలకు వేణు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 
 
ఈ చిత్రంలో హ్యాపీడేస్‌లో టైసన్ క్యారెక్టర్‌తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు. రాహుల్ డిఫరెంట్ లుక్‌తో, ఆటిట్యూడ్‌తో కనిపించబోతున్నారు. బాలీవుడ్ టీవీ ఆర్టిస్ట్ మహిమా మక్వాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అచ్చు సంగీత దర్శకత్వం వహించాడు. సాయి ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. కాశీ విశ్వనాథ్, అజయ్, జోగి బ్రదర్స్, అనితా, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రాన్ని శ్రీయాస్ శ్రీనివాస రావ్, తుము ఫణి కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ వెంకటాపురం ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు సైతం ప్రశంసించడం విశేషం. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్ కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటుంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. దర్శకుడు వేణు డిఫరెంట్ కథను, తనదైన స్క్రీన్ ప్లేతో ఎంటర్ టైనింగ్‌గా చెప్పబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.