Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..

గురువారం, 18 మే 2017 (12:45 IST)

Widgets Magazine

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోయి.. బుల్లితెరపై ఆకట్టుకున్న బాలీవుడ్ అలనాటి నటి రీమా లగూ ఇకలేరు. అమ్మ పాత్రలకు వన్నె తెచ్చి.. ప్రముఖ హీరోలకు తల్లిగా నటించిన రీమా లగూ.. గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ముంబైలోని బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. 
 
హిందీ, మరాఠీ భాషల్లో పలు ధారావాహికల్లో నటించిన ఈమె.. 1970, 80 దశకంలో బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందారు. ఖయామత్ సే ఖయామత్ తక్, సాజన్, దిల్ వావలే, కుచ్ కుచ్ హోతాహై, దిల్ తేరా దివానా తదితర సినిమాలో రీమ లగూ నటించారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'మైనే ప్యార్ కియా'లో సల్మాన్‌కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. 
 
1958లో జన్మించిన రీమా.. బుల్లి తెరపై వచ్చిన 'శ్రీమాన్ శ్రీమతి'లో నటించి ఎంతో మంది అభిమానుల సంపాదించుకున్నారు. కామెడీ సీరియల్ 'తు తు మై మై'లో కూడా నటించారు. సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 1990 మైనే ప్యార్ కియా చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకోగా, 1991 ఆషికి చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 
 
ఇంకా 1995 హహ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2000 వాస్తవ్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇలా ఎన్నో అవార్డులు ఆమె సినీ ఖాతాలో ఉన్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సుశాంత్ తండ్రి మృతి.. విషాదంలో అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) ...

news

బాహుబలికి పోటీగా సంఘమిత్ర.. కేన్స్‌లో ప్రారంభం.. టైటిల్ పాత్రలో శ్రుతిహాసన్

బాహుబలికి పోటీగా కోలీవుడ్ భారీ బడ్జెట్ మూవీగా సంఘమిత్ర రూపుదిద్దుకోనుంది. బాహుబలి ...

news

'ఇమైక్క నొడికల్'లో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార..

నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ ...

news

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ, ఫ్యాన్స్‌తో భేటీ... అంతా రోబో 2.0 పబ్లిసిటీ కోసమేనా?

రోబో 2.0 సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా వివిధ భాషల్లో ...

Widgets Magazine