Widgets Magazine Widgets Magazine

కాంచన రీ ఎంట్రీ.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్‌కి బామ్మగా కనిపిస్తారట..

మంగళవారం, 29 నవంబరు 2016 (13:34 IST)

Widgets Magazine

ఒక్కప్పటి హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్లు అవుతున్నారు. అలాంటి అలనాటి నటీమణులు అమ్మ, బామ్మ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అలనాటి అందాల తారలు సరోజా దేవి వంటి వారు హీరోయిన్లకు బామ్మగా కనిపిస్తుంటే.. తాజాగా మరో అలనాటి అందాల నటి కాంచన దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్లీ నటించబోతున్నారు.

77 ఏళ్ల కాంచన శ్రీదత్త దర్శనం అనే తెలుగు సినిమాలో నటించారు. 1985లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'లో కాంచన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా ధ్రువీకరించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాంచన ఆతని బామ్మగా కనిపిస్తారని సందీప్ తెలిపారు. ఈ చిత్రంలో నటించేందుకు కాంచన తొలుత ఒప్పుకోలేదని... ఎంతో కష్టపడి ఆమెను ఒప్పించామని తెలిపాడు. సదీర్ఘ చర్చల అనంతరం నటించేందుకు ఆమె ఓకే చెప్పారని అన్నాడు. ఈ సినిమాలో కాంచనది కీలక పాత్ర అవుతుందని చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రంభకు తోడుగా స్నేహ.. బుల్లితెర డ్యాన్స్ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తారట..

రంభ, స్నేహా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సినీ ఛాన్సుల ...

news

లిప్‌లాక్ కిస్ పెట్టినందుకు అన్నతో బూతులు తిట్టించుకున్న హీరోయిన్ ఎవరు?

సినిమాల్లో నటించేటపుడు లిప్‌లాక్ కిస్‌లు సర్వసాధారణం. కథా పాత్రల డిమాండ్ ఉన్నా ...

news

గ్లామర్ ప్లస్ నట రెండూ ఉన్న కీర్తి సురేష్ టాలీవుడ్ క్వీన్ అవుతుందా? రకుల్ ప్రీత్ సింగ్ అవుట్?

''నేను శైలజ'' సినిమాతో టాలీవుడ్‌తో అడుగుపెట్టిన కీర్తికి అవకాశాలు వచ్చినా సెలెక్టివ్‌గా ...

news

నిజమే.. నేను పెళ్లికి ముందు డేటింగ్ చేశాను : విద్యాబాలన్

చిత్ర పరిశ్రమలో డేటింగ్ అన్నది ఇపుడు బహిరంగ రహస్యం. అయినా సరే తాము డేటింగ్‌లో ఉన్నామని, ...