గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (13:35 IST)

విద్యాబాలన్ ఎక్కడ..? ధనుష్ ఎక్కడ..? కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా?

షమితాబ్ హీరో అయినప్పటికీ బక్క పలచని ధనుష్ సరసన.. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనుందనే వార్త రాగానే అందరూ నిజంగానే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అని చర్చించుకుంటున్నారు. తమిళ సినిమాలో ఛాన్స్‌లు రాకపోవడంతో ఒకప్పుడు విద్యాబాలన్ యాడ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే డర్టీ పిక్చర్‌లో అమ్మడు యాక్టింగ్ చూసి ఒక్క కోలీవుడేంటి..? ప్రపంచ సినీ ఇండస్ట్రీనే విద్యాబాలన్ అంటే వామ్మో అంటూ నోరు మీద వేలేసుకునేట్లు చేసింది. 
 
ఈ నేపథ్యంలో దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ డబుల్ రోల్ చేసే.. పేరు ఖరారు కాని సినిమాలో ఎలాగైనా విద్యాబాలన్‌ను నటింపజేయాలని బక్కహీరో ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఈ బక్క హీరో సరసన విద్యాబాలన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో? లేదో? అనే దానిపై చర్చ సాగుతోంది. బక్క హీరో పక్కన నటిస్తే కెమిస్ట్రీ వర్కౌట్ కాదంటూ విద్యాబాలన్ తమిళ సినిమా ఛాన్స్‌ను పక్కనబెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.