Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరో విశాల్‌పై హత్యాబెదిరింపుల కేసు.. అభిమానులకు ఫోన్ నెంబరిచ్చి బెదిరించాడా?

శుక్రవారం, 12 మే 2017 (18:29 IST)

Widgets Magazine

నడిగర్ సంఘం ఎన్నికల నాటి నుంచి హీరో విశాల్‌ను కేసులు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్మాత, దర్శకుడు సురేశ్‌ కామాక్షి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇటీవల జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తాను విశాల్ వర్గానికి పోటీగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశానని.. అయితే విశాల్ అభిమానులు హత్యాబెదిరింపులకు పాల్పడ్డారని వడపళని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్‌ అభిమాన సంఘం అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కమల్‌కన్నన్, మరో అభిమాని తనపై రౌడీయిజానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 
 
అయితే నటుడు విశాల్‌కు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవని సురేష్ తెలిపారు. కానీ నిర్మాతల సమస్యలపై గళమెత్తానని.. సోషల్ మీడియాలో నడిగర్ సంఘం, నిర్మాతల మండలి సమస్యలపై పోరాడకపోవటాన్ని ఎత్తిచూపానని సురేశ్‌ కామాక్షి అన్నారు. దీంతో విశాల్‌ తన అభిమానులకు తన సెల్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి హాత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి బాటలో జయప్రద... సామాజిక న్యాయం కోసం మళ్లీ మేకప్...

కాసింత పాపులారిటీ ఉన్న హీరోలే ఏదో ఒక వంక చెప్పి, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల పుణ్యమాని ...

news

నిజాలు చెపుతుంటే పాత్రలో లీనమై నిజంగానే ఏడ్చేశా : రమ్యకృష్ణ

'బాహుబలి 2' చిత్ర విజయంపై సినీ నటి రమ్యకృష్ణ మరోమారు స్పందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ...

news

''రాధ'' రివ్యూ రిపోర్ట్: రొటీన్ స్టోరీ.. కామెడీ పండింది.. టైమ్ పాస్ కోసం చూడొచ్చు..

పోలీసు డిపార్ట్‌మెంట్‌కి జరిగిన అన్యాయాన్ని ఓ పోలీస్ అధికారి ఎలా ఎదిరించాడనే పాయింట్‌తో ...

news

కలలన్నీ నావే... కలకాలం నీవే... ఎక్కడికో తీసుకెళ్లే ఇళయరాజా...(video)

ఆ పాటలో ప్రణయం... జీవితం... వినసొంపు గీతం అది. చిత్రం : రాజ్ కుమార్ ( విడుదల- ...

Widgets Magazine