శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (17:56 IST)

విశాల్-వరలక్ష్మిల లొల్లి.. ట్విట్టర్లో సెల్ఫీ ఫోటో.. అన్నింటికీ ఆ ఫోటో సమాధానం ఇస్తుందట.!!

వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్పీ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విశాల్, అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ కూడా రాశాడు. కానీ ఈ ఫోటో వెనక గల రహస్యం ఏంటనేది మాత్రం ఎవ్వరికీ అర్థం

తెలుగబ్బాయ్ అయినా కోలీవుడ్‌లో అగ్ర హీరోగా ఎదిగిన విశాల్.. ప్రస్తుతం ట్విట్టర్లో ఓ ఫోటో పోస్ట్ చేసి అందరి నోళ్ళల్లో నానుతున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ పందెం కోడి, రాయుడు వంటి సినిమాలతో మంచి పేరు కొట్టేసిన విశాల్.. తాజాగా శరత్ కుమార్‌తో డిష్యూం డిష్యూం, వరలక్ష్మీతో ప్రేమాయణం వంటి అనేక అనుమానాలకు ఈ ఒక్క ఫోటో సమాధానం చెప్తుందని.. ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో వరలక్ష్మి, విశాల్ ఉన్నప్పటికీ.. అసలు ఆ పిక్ ద్వారా అతడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేది ప్రస్తుతం మళ్ళీ చర్చనీయాంశమైంది.
 
తమిళనాట వరుస హిట్స్తో హీరోగా మంచి ఫాం కొనసాగిస్తునే నడిగర్ సంఘం నేతగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచాడు. చాలాకాలం పాటు విశాల్, వరలక్ష్మిల మధ్య ఏదో నడుస్తోందని వార్తలు షికారు చేసినా.. విశాల్ నోరెత్తలేదు.
 
ముఖ్యంగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్, విశాల్ నువ్వానేనా అని తలపడటంతో ఇక వరలక్ష్మితో ప్రేమాయణానికి గండిపడినట్లేనని అంతా అనుకున్నారు. కానీ ఈ అనుమానాలకు చెక్ పెడుతూ ఒక్క ఫొటోతో మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు విశాల్. వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్పీ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విశాల్, అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ కూడా రాశాడు.
 
కానీ ఈ ఫోటో వెనక గల రహస్యం ఏంటనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. సినీ వర్గాలు మాత్రం వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మీదే విశాల్ క్లారిటీ ఇచ్చాడని అనుకుంటున్నారు. అయితే శరత్ కుమార్ వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అందుకే విశాల్ వరలక్ష్మితో కలిసి సెల్ఫీ తీసుకుని ట్విట్టర్లో పోస్ట్ చేశాడా అనే ప్రశ్నలు తలెత్తాయి. విశాల్ ఈ ఫోటోనే అన్నింటికి సమాధానమిస్తుందని చెప్పాడు కానీ.. ఆ ఫోటోనే ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి విశాల్ వరలక్ష్మితో ప్రేమాయణంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.