Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగుపాముతో సెల్ఫీ.. బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్‌కు కష్టాలు తప్పవా?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:11 IST)

Widgets Magazine

నాగుపాముతో సెల్ఫీ తీసుకున్న బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో నాగుపామును చేతిలో పట్టుకుని ఫోజిచ్చిన ఉల్ఫత్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అటవీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఆమెతో పాటు మరో నటి, ఇద్దరు ప్రొడక్షన్‌ మేనేజర్లను అరెస్టు చేశారు. ఈ వీడియోను శ్రుతి అక్టోబరు 16న సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. 
 
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముంబయి అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డైలీ సీరియల్‌ 'నాగార్జున' ప్రచారం కోసం శ్రుతి నాగుపాముతో ఉన్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన పలువురు జంతు సంరక్షణ కార్యకర్తలు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శ్రుతిని, సీరియల్‌ యూనిట్‌ను విచారించింది. 
 
కానీ అది నిజమైన పాము కాదని యూనిట్ తెలిపింది. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఆ పాము నిజమైనదేనని పేర్కొంది. దీంతో శ్రుతికి నోటీసులు పంపి, పీవోఆర్‌ దాఖలు చేసి విచారణకు రమ్మనమని తెలిపారు. శ్రుతితోపాటు ఇద్దరు ప్రొడక్షన్‌ మేనేజర్లు విచారణకు బుధవారం వచ్చారు. అది నిజమైన నాగుపాము అని ఒప్పుకోవడంతో వారిని కోర్టుకు తీసుకెళ్లగా ఒక్కరోజు ఫారెస్ట్‌ కస్టడీలోకి తీసుకోమని తీర్పు ఇచ్చింది. 
 
సీరియల్‌ కోసం ప్రాణంతో ఉన్న పామును ఉపయోగించడాన్ని పలువురు జంతుప్రేమికులు, కార్యకర్తలు ఖండించారు. సోషల్‌మీడియాలో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. అయితే దురుద్దేశంతో పాములకు హాని చేయాలని ఆమె ఈ వీడియో చిత్రీకరించలేదు కాబట్టి ఆమెకు ఈ నేరం కింద శిక్ష వేసే బదులు వన్య ప్రాణి సంరక్షణకు కృషిచేయమని కోరాలని పలువురు సూచించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిచ్చగాడు హీరోయిన్ సట్నా రెండోసారి పెళ్లి చేసుకుందంటే నమ్ముతారా?

బిచ్చగాడు హీరోయిన్ రెండోసారి వివాహం చేసుకుంది. ఇదేంటి? రెండోసారి పెళ్లి చేసుకుందా? అని ...

news

భార్యతో కలిసి అమెరికాలో ల్యాండైన పవన్‌ కళ్యాణ్.. ఎందుకు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ...

news

"ఖైదీ నంబర్.150" చిత్రానికి చిరంజీవి రెమ్యునరేషన్ రూ.33 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ...

news

''మా''కు రాజేంద్రప్రసాద్ సేవలకు రెండేళ్లు పూర్తి.. మంచినీళ్లు, కాఫీ కోసం కూడా పైసా ఖర్చు పెట్టలేదు!

''మా" మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క‌మిటి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈసీ ...

Widgets Magazine