బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (18:54 IST)

ఆ హీరో నన్ను పడక గదికి రమ్మన్నాడు.. గట్టిగా చెంపపై లాగి కొట్టడంతో సైలెంట్ అయ్యాడు : రాధికా ఆప్టే

నగ్న సన్నివేశాల్లో నటిస్తూ హాటెస్ట్ హీరోయిన్‌గా పేరుగాంచిన నటి రాధికా ఆప్టే. ఈమె ఓ హీరో చేతిలో లైంగిక వేధింపులకు గురయిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ...

నగ్న సన్నివేశాల్లో నటిస్తూ హాటెస్ట్ హీరోయిన్‌గా పేరుగాంచిన నటి రాధికా ఆప్టే. ఈమె ఓ హీరో చేతిలో లైంగిక వేధింపులకు గురయిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... 
 
'ఓ దక్షిణాది సినిమాలో నటించే సమయంలో అక్కడి హీరో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నేను బస చేసిన హోటల్‌కు ఫోన్‌ చేసి నాతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఆయన చాలా తప్పుగా మాట్లాడడంతో నేను చాలా పెద్ద గొడవ చేశా. ఇది సరికాదని చాలా గట్టిగా హెచ్చరించా. దెబ్బకు ఆయన సైలెంట్‌ అయిపోయాడు’ అని చెప్పింది.
 
అంతకుముందు ఓ హిందీ సినిమా సమయంలో ఇంతకంటే దారుణమైన అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ‘ఓ హిందీ సినిమాలో నటించడానికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ నిర్మాత.. నన్ను వేరొకరి బెడ్రూమ్‌లో గడపమన్నాడు. అలా అయితేనే అవకాశం వస్తుందని చెప్పాడు. ఇది చాలా అనాగరికం అని, నన్ను బెడ్రూమ్‌కు రమ్మన్నవాడు నరకానికి పోతాడని గట్టి వార్నింగ్‌ ఇచ్చాన’ని చెప్పినట్టు రాధిక తెలిపింది.