శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (15:41 IST)

దాసరిని పిలిచిన చిరు, 'ఖైదీ' బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డిని ఎందుకు పిలువలేదు?

దాసరి నారాయణ రావు, చిరంజీవి అంటేనే అదేదో చలికాలంలో కూడా వేడి భగ్గుభగ్గుమంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. గతంలో చెర్రీ అయితే దాసరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే అవన్నీ పక్కనబెట

దాసరి నారాయణ రావు, చిరంజీవి అంటేనే అదేదో చలికాలంలో కూడా వేడి భగ్గుభగ్గుమంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. గతంలో చెర్రీ అయితే దాసరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే అవన్నీ పక్కనబెట్టి మొన్న ఖైదీ నెం.150 ప్రి-రిలీజ్ కార్యక్రమానికి ఇండస్ట్రీలో పెద్దతరం దర్శకుడు దాసరిని ఆహ్వానించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు మెగాస్టార్. ఐతే తన కెరీర్ ను ఓ మలుపు తిప్పిన ఖైదీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని ఆహ్వానించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. 
 
చిరంజీవి ఆయనను ఆహ్వానించకపోవడానికి బలమైన కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే చిరంజీవి దాదాపు పదేళ్ల విరామం తర్వాత ముఖానికి రంగేసుకుని ఖైదీ నెం.150 చిత్రం చేయాలని సంకల్పించిన సందర్భంలో కొందరు కోదండరామిరెడ్డిని ప్రశ్నలు అడిగారు. చిరంజీవి గురించి అడగ్గానే... కోదండరామిరెడ్డి చిరుకు నెగిటివ్ గా స్పందించారు. ఇప్పుడే చిరుతో నన్ను సినిమా చేయమని ఎవరైనా అంటే... నేను ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రాన్ని తీస్తానన్నారు. 
 
అంతేకాదు.. ఇప్పుడు ఆయన సందేశాలను చెపుతూ చిత్రంలో నటిస్తే ఆయనను చూసేవారుంటారా అని కూడా ప్రశ్నించారు. దీంతో మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఆ వెంటనే కోదండరామిరెడ్డి చిరంజీవి గురించి ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదనీ, బాధపెట్టి వుంటే క్షమించాలని కోరారు. కానీ చిరంజీవి కోదండరామిరెడ్డిని క్షమించినట్లు లేదు. ఎందుకంటే ప్రి-రిలీజ్ ఫంక్షనుకు దాసరిని పిలిచిన చిరంజీవి కోదండరామిరెడ్డిని పిలవకపోవడం చూస్తే ఇది తెలుస్తుంది.