మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (08:04 IST)

బాహబలిని కట్టప్ప ఎందుకు చంపాడో నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు: కట్టప్ప సత్యరాజ్‌

రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి రెండో భాగం ఎంత విలువైనదో తనకు తెలుసు కాబట్టే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం తెలిసినప్పటికీ నా కుటుంబానికి కూడా ఆ రహస్యాన్ని ఇంతవరకు చెప్పలేదని

రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి రెండో భాగం ఎంత విలువైనదో తనకు తెలుసు కాబట్టే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం తెలిసినప్పటికీ నా కుటుంబానికి కూడా ఆ రహస్యాన్ని ఇంతవరకు చెప్పలేదని కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ చెప్పారు. బాలివుడ్ నటి, యాంకర్ అనుపమ్ చోప్రా ఈ విషయమై అడిగిన ప్రశ్నకు సత్యరాజ్ ఉద్వేగంగా సమాధానమిచ్చారు. సినీ పరిశ్రమలో 40 ఏళ్లుగా కొనసాగుతున్నానని ఈ సినిమా విలువు తెలుసు కాబట్టే ఎవరికీ ఈ రహస్యాన్ని చెప్పలేదన్నారు.
 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ ఈ ప్రశ్నకు సమాధానం గురించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని సత్యరాజ్‌ అన్నారు. వారి నుంచి తప్పించుకునేందుకే దర్శకుడు చంపమంటేనే ఆ పని చేశానని చెబుతుంటానని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు. అయితే ఎవరు ఎన్నిసార్లుఈ ప్రశ్న అడిగినా తనకు విసుగురాదని తెలిపారు. 
 
ఈ రెండేళ్లుగా దేశంలో ఎన్ని పరిణామాలు సంభవించినా జనం కట్టప్ప వద్దకే తిరిగి వస్తున్నారని సత్యరాజ్ తన పాత్ర పొందిన ప్రచారం గురించి పొంగిపోతూ చెప్పారు. చివరికి పెద్ద నోట్ల రద్దు అంత ముఖ్య ఘటన జరిగినప్పుడు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న వేయటం మాత్రం మర్చిపోలేదని సత్యరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఒక్క డైలాగ్... భారతీయ సినీ ప్రేక్షకులనే కాదు. ప్రపంచవ్యాప్తంగా మూవీ ఆడియన్స్‌ని వెర్రెత్తించేలా చేసింది. ఒక్క డైలాగ్.. ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత హైప్ సృష్టించి రెండేళ్లుగా ఒక ప్రశ్నకు సమాధానం కోసం కోట్లమందిని ఎదురు చూసేలా చేస్తోంది. ఒక పాత్ర.. తన చలనచిత్ర జీవితంలో తీసిన 250 సినిమాలు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు అంటూ పరమానందంతో తన చలనచిత్ర చరిత్రనే ఒక నటుడు కాదనుకునేలా చేసింది. ఇంతకూ ఆ డైలాగ్ ఏమిటి. బాహుబలిని చంపింది నేనే.. అని బాహుబలి ది బిగినింగ్‌లో కట్టప్ప చెప్పిన డైలాగ్. సినిమా ఆ డైలాగ్‌తోనే ముగిశాక సినీ ప్రపంచాన్ని వెర్రెత్తించిన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి..
 
ప్రపంచం మొత్తాన్ని ఊగిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మరొక్క 50 రోజులు వేచి చూస్తే చాలు.. ఏప్రిల్ 28. ప్రపంచం మొత్తానికి సమాధానం ఆరోజు తెలుస్తుంది.