మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (17:09 IST)

నాకు రెమ్యునరేష్ పెరిగినా.. అది అక్కడికే వెళ్తుంది: సల్మాన్ ఖాన్

రెమ్యునరేష్‍‌పై మీడియా వేసే ప్రశ్నలకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు తాను యాంకర్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 9' కార్యక్రమం ప్రమోషన్లలో ప్రస్తుతం సల్మాన్ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో, పలు మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయంపై మీడియా ప్రతినిధులకు ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు.
 
మీరు (మీడియా ప్రతినిధులు) తీసుకుంటున్న జీతాల విషయమై తనకు ఎలాంటి ఆసక్తి లేదు. మరి తన జీతంపై మీకెందుకంత ఆసక్తి అంటూ ప్రశ్నించాడు. తాను తీసుకునే రెమ్యునరేషన్ పెరిగినా అది బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌కే వెళ్తుందని చెప్పారు. 2007లో కొన్ని సంస్థలతో కలిసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌ను సల్మాన్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ద్వారా విద్య, వైద్య సేవల కొరకు ఎంతోమందికి సల్మాన్ సాయం చేస్తున్నారు.