Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి అస్థికలను రామేశ్వరానికి తర్వాత హరిద్వార్‌లో ఎందుకు కలిపారో తెలుసా?

శుక్రవారం, 9 మార్చి 2018 (16:48 IST)

Widgets Magazine

అతిలోక సుందరి శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు రోజుల తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తీసుకొచ్చిన బోనీ కపూర్ కుటుంబీకులు.. ఫిబ్రవరి 28వ తేదీన శ్రీదేవి భౌతికకాయానికి అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలో దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఆమె అస్థికలను ముందు రామేశ్వరంలోను.. ఆ తర్వాత హరిద్వార్‌లో కలిపారు. 
 
అయితే శ్రీదేవి అస్థికలను రెండు చోట్ల కలిపేందుకు కారణముందని బోనీ సన్నిహితులు మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. 1993లో శ్రీదేవి ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా హరిద్వార్ వెళ్లారట. కానీ షూటింగ్‌లో బిజీగా వుండి హరిద్వార్‌ను శ్రీదేవి దర్శించుకోలేకపోయారని.. మళ్లీ హరిద్వార్‌ వస్తానని మొక్కుకున్నారు. కానీ ఇప్పటివరకు శ్రీదేవికి హరిద్వార్ వెళ్లే అవకాశం దక్కలేదట.
 
అందుకే శ్రీదేవి నెరవేరని కోరికను.. ఆమె అస్థికలను హరిద్వార్‌లోని గంగానదిలో కలపడం ద్వారా బోనీ కపూర్ నెరవేర్చారని సన్నిహితులు చెప్తున్నారు. తొలుత ఆమె అస్థికలను తమిళనాడులోని రామేశ్వరంలో కలిపారు. ఈ కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు కుమార్తెలు జాన్వి, ఖుషి కూడా వెళ్లారు. ఆపై హరిద్వార్‌లో నిర్వహించిన కార్యక్రమానికి బోనీతో పాటు అనిల్‌కపూర్‌, కరణ్‌ జోహార్‌, శ్రీదేవి స్నేహితుడైన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా కూడా వెళ్లారు. 
 
పిండ ప్రదానం చేస్తున్న సమయంలో బోనీ కపూర్‌ కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా శ్రీదేవి ''మామ్‌'' సినిమాతో ఆమె సినీ ప్రస్థానానికి ముగింపు పలికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంకా శ్రీదేవి పెద్ద కూతురు జాన్విని వెండితెరపై చూసుకోకుండానే మృతిచెందడం బాధాకరమని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మహానేత వైఎస్సార్ బయోపిక్‌లో లేడీ సూపర్ స్టార్.. (వీడియో)

మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం ...

news

మీ లైక్స్ కోసం ఇలా గాలి వార్తలు ప్రచారా చేస్తారా?: హీరో శ్రీకాంత్ ఆగ్రహం

ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా ...

news

ఎమ్మెల్యే కుమార్తెతో సినీ దర్శకుడి వివాహం... ఎక్కడ?

ఓ ఎమ్మెల్యే కుమార్తెతో ఓ సినీ దర్శకుడి వివాహం గుడిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ...

news

ఈయన వెంకీనా...? లుక్ అదిరిపోయిందిగా....!!

విక్ట‌రీ వెంక‌టేష్...తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ...

Widgets Magazine