Widgets Magazine

పెళ్లి చేసుకున్నా.. పవన్‌తో టచ్‌లో ఉంటా : రేణూ దేశాయ్

శుక్రవారం, 29 జూన్ 2018 (12:58 IST)

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. వాస్తవానికి ఈమె పవన్‌తో కలిసి సహజీవనం చేయగా, వీరికి అకీరా, అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలు మాత్రం రేణూ వద్దే ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో రేణూ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరు పిల్లలను పవన్ తన వద్దకు పిలిపించుకున్నారు.
 
ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్‌పై రేణూ దేశాయ్ స్పందించింది. తన పిల్లల కోసం పవన్‌తో టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి. వారి భవిష్యత్ కోసం తప్పక టచ్‌లో ఉండాల్సిందే. సెలవులు వచ్చినప్పుడు, లేదా ఏవైన వేడుకలు ఉన్నప్పుడు అకీరా, ఆద్యాలు తప్పక ఆయన దగ్గరకు వెళతారు, నా వద్దకూ వస్తారు అని చెప్పుకొచ్చింది. రేణూ మాటలతో అభిమానులలో ఉన్న పలు అనుమానాలు తొలగిపోయినట్టు అయింది.
 
కాగా, రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ, తన రెండో మ్యారేజ్ ప్రకటన చేసినప్పటి నుండి రేణూకి ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆమె తన తన ట్విట్టర్ ఖాతాని తాజాగా క్లోజ్ చేసింది. ఆమెని ఎంతగానో అభిమానించే అభిమానులు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూతో టచ్‌లో ఉంటూనే ఉన్నారు. అయితే, ఓ అభిమాని పెళ్లి తర్వాత కూడా మీరు పవన్‌తో టచ్‌లో ఉంటారా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్‌లో సందడే సందడి : గీతా మాధురి పాట.. భాను, తేజ‌స్వీల స్టెప్పులు

నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ ...

news

అవును.. నాకూ ఆ అనుభవం వుంది.. చెత్త సలహాలిచ్చేవారు: దీపికా పదుకునే

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఓ ఇంటర్వ్యూలో మహిళలపై లైంగిక వేధింపులపై మాట్లాడింది. తన ...

news

రొటీన్‌కు భిన్నంగా 'ఈ నగరానికి ఏమైంది' : మూవీ రివ్యూ

తరుణ్ భాస్కర్. టాలీవుడ్‌కు పరిచయమైన యువ డైరెక్టర్. 'పెళ్లిచూపులు' చిత్రంతో అటు ...

news

ఎన్టీఆర్ బయోపిక్‌.. బాలకృష్ణ, క్రిష్‌లకు నోటీసులు.. ఎందుకంటే?

ఎన్టీఆర్ బయోపిక్‌పై నాదెండ్ల భాస్కరరావు ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ...

Widgets Magazine