Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్-త్రివిక్రమ్ సినిమా.. పాట పాడనున్న కాటమరాయుడు.. హిట్ ఖాయం?

గురువారం, 13 జులై 2017 (09:24 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో లవ్, రొమాన్స్,  సెంటిమెంట్, కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లు వుంటాయి. ఈ సినిమాలో పవన్ కోసం మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లు వుంటాయని టాక్. 
 
పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానుండటంతో ఫ్యాన్స్‌కి సంతృప్తినిచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో త్రివిక్రమ్-పవన్‌లకు హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. ఇందులో పవన్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్.. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. గబ్బర్ సింగ్, కాటమరాయుడు నిరాశపరచిన పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ సినిమాలో మరోసారి పాట పాడనున్నారట. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా పాటను పాడిన పవన్.. త్రివిక్రమ్ తాజా చిత్రంలోను ఓ పాట పాడనున్నట్లు సమాచారం. చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్‌ రవిచంద్రన్ ఈ సాంగ్ కోసం మంచి బాణీలు రెడీ చేసాడని టాక్. హారిక అండ్ హాసిని బేనర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ ముందే భారీ రేట్లు పలుకుతోంది. తాజా సమాచారం ప్రకారం జెమినీ టీవీ పవన్-త్రివిక్రమ్ సినిమా శాటిలైట్ రైట్స్‌ను రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భావనపై లైంగికదాడికి 2013లోనే స్కెచ్. 1.5 కోట్లు ఇచ్చిన దిలీప్

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...

news

వంటిపై ఆచ్చాదనే లేని హీరోయిన్.. అన్నీ వదిలేసిన అమీ

మోడల్ నుంచి నటిగా మారిన అమీ జాక్సన్ అద్బుతమైన బాడీ ఫిజిక్‌కు మారుపేరు. ఈ బ్రిటిష్ బ్యూటీ ...

news

బిగ్ బాస్‌పై రచ్చ ఎందుకు? ముద్దు సీన్ల సంగతేంటి? రజనీ పార్టీ పెడితే..?: కమల్ హాసన్

"బిగ్ బాస్" కోసం తాను తప్పు చేస్తానా? ఈ షో వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే.. గత 11 ...

news

తెలుగు నిర్మాతలు పెద్దమనుషులే కానీ.. బిచ్చగాళ్లవుతున్నారు.. తమిళ దర్శకుడి విచారం

తెలుగు సినీ నిర్మాతలు ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చే బిచ్చగాళ్లుగా మారారని సీనియర్‌ దర్శకుడు ...

Widgets Magazine