Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్...

బుధవారం, 5 జులై 2017 (16:07 IST)

Widgets Magazine

తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నుల భారం మోపాయి. ముఖ్యంగా జీఎస్టీ పేరుతో కేంద్రం 28 శాతం మోపగా, వినోదపు పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పన్ను భారం మోపింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుభారం 58 శాతానికి చేరింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించని తమిళాడు థియేటర్ వాణిజ్య మండలి, నిర్మాతల సంఘాలు కలిసి గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. 
 
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నును తక్షణం రద్దు చేయాలని కోరుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన చేస్తూ.. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100కి పైగా థియేటర్లు మూతపడ్డాయి. అలాగే, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వివిధ రూపాల్లో తమ నిరసనను, కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఈ పన్నుపై ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు వ్యాప్తంగా థియేటర్ల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సినిమా పరిశ్రమకు మద్దతుగా నిలిచారు. తమిళ చిత్ర పరిశ్రమలో లక్షలాది మంది ప్రజల గురించి ఆలోచించి తమ విన్నపాన్ని పరిగణించాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. 
 
కాగా, జీఎస్టీపై ఇప్పటికే కమల్ హాసన్, టి.రాజేందర్ వంటి సీనియర్ నటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం అదనపు పన్నువసూలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యంగా, జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా వినోదం పన్ను అంటూ 'జంట బాదుడు' చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలకు మింగుడు పడటం లేదు. జీఎస్‌టీని తాము వ్యతిరేకించడం లేదని, వినోదం పన్ను తీసేయాలని చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు, థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పిచ్చెక్కిస్తున్న యామీ గౌతమ్ వాటర్ యోగా... (Video)

బాలీవుడ్ హాట్ నటీమణుల్లో యామీ గౌతమ్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో తాజాగా నటించిన చిత్రం 'కాబిల్'. ...

news

తమ్ముడి కడచూపుకు వెళ్లలేదు.. సంస్మరణ సభకు వచ్చిన రవితేజ

టాలీవుడ్ హీరో రవితేజ మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన సోదరుడు ...

news

పెళ్ళిచూపులు హీరో కొత్త సినిమా అర్జున్ రెడ్డి.. షాలినితో కిస్సింగ్ సీన్ మేకింగ్ వీడియో

‘ఎవడే సుబ్రమణ్యం’, పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. ...

news

సచిన్ టెండూల్కర్ పక్కింటిలో పూనమ్ పాండే.. ఇక గోల గోలే...

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పక్కింటికి వెళ్ళిపోయింది.. సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ...

Widgets Magazine