శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (13:03 IST)

XXX ఫస్ట్ లుక్ రిలీజ్: డీజిల్, దీపిక ఫోటోలకు నెటిజన్ల లైక్స్ వెల్లువ..!

హాలీవుడ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే తొలి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్‌తో కలిసి XXX రెండవ పార్ట్‌లో దీపిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టొరంటోకు దీపిక వెళ్ళింది. ఈ నేపథ్యంలో తొలిరోజు షూటింగ్ సెట్స్‌లో దీపికా పదుకునే, విన్ డీజిల్ సన్నివేశాలు ఫస్ట్ లుక్ అంటూ విడుదలయ్యాయి.

విన్ డీజిల్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వార్ దీనిని పోస్టు చేశాడు. ఈ ఫోటోను అనేకమంది లైక్ చేస్తున్నారు. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో దీపికా సెరీనాగానూ, డీజిల్ జాండర్‌గా నటిస్తున్నారు.
 
ఇకపోతే.. కెనడాలోని టొరంటోలో ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవల ఫిల్మ్ ఫేర్‌లో ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న దీపికా గ్జాండర్ కేజ్ సినిమాలో సెరీనా పాత్రను పోషిస్తోంది. ఆ మూవీకి డీజే కరుసో దర్శకుడు. రసూల్ కార్పెంటర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం దీపికా పదుకునే బాగా కసరత్తులు చేస్తుంది. స్టంట్స్ నేర్చుకుంటోంది. XXX సిరీస్‌లో వస్తున్న రెండవ మూవీ 2017లో విడుదల కానుంది.